బుల్లితెర నటీనటులు పవిత్ర జయరాం( Pavitra Jayaram ), చందు( Chandu )మరణ వార్త బుల్లితెర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.కారు ప్రమాదంలో భాగంగా త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరాం మరణించడంతో విషాదం నెలకొంది అయితే పవిత్రతో రిలేషన్ లో ఉన్నటువంటి చందు ఆమె మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు దీంతో ఆయన కూడా రెండు రోజుల తర్వాత ఆత్మహత్య చేసుకొని మరణించడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు.
ఇలా వీరిద్దరి మరణ వార్త బుల్లితెర పరిశ్రమకు తీరని లోటు అని చెప్పాలి.ఇప్పటివరకు వీరి మరణ వార్త నుంచి బుల్లితెర పరిశ్రమ బయటపడలేదు.అయితే తాజాగా సినీ నటుడు నరేష్ ( Naresh ) బుల్లితెర సెలబ్రిటీల మరణం గురించి స్పందిస్తూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.మన ఆత్మీయులు మనల్ని సడన్ గా విడిచి వెళ్లిపోతే భరించలేని బాధ కలుగు తుంది.
ఆ సమయంలో ఓదార్చేవారు ధైర్యం చెప్పేవారు పక్కనే ఉండాలి.నేను కూడా అలాంటి సంఘటన ఎదుర్కొన్నానని తెలిపారు.
అమ్మ విజయనిర్మల( Vijaya Nirmala ) మరణం తర్వాత నాకు అంత శూన్యం అనిపించింది.ఆ సమయంలో నేను కృష్ణ ( Krishna ) గారు ఎంతో బాధను అనుభవించాము.ఆ సమయంలో ఒకరినొకరు ఓదార్చుకున్నామని తెలిపారు.గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి.ఎంత బాధాకర సంఘటన జరిగిన ఒకరికొకరు తోడుండేవారు.ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని నరేష్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
పవిత్ర చనిపోయినప్పుడు చంద్రకాంత్ ఆత్మస్థైర్యం కోల్పోయి ఒంటరి వాడయ్యాడు.ఆ సమయంలో తన కుటుంబం తనకు తోడుగా ఉండి ఉంటే ఇలా జరిగేది కాదని నరేష్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.