రాజమౌళి తర్వాత ఆ స్థాయి దర్శకులు వీళ్లే.. ఈ నలుగురికే ఆ రేంజ్ టాలెంట్ ఉందా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది డైరెక్టర్లు రాణిస్తున్న విషయం తెలిసిందే.అయితే ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్స్ లో నెంబర్ వన్ ఎవరు అంటే రాజమౌళి(rajamouli )పేరు ఎక్కువగా వినిపిస్తోంది.

 Rajamouli Range For 4 Young Director, Rajamouli, Young Directors, Sujith, Nag As-TeluguStop.com

ఆర్ఆర్ఆర్ సినిమాతో జక్కన్న గ్లోబల్ లెవల్ లో దర్శకుడిగా విశేషమైన ప్రశంసలు సొంతం చేసుకున్నారు.అంతే కాకుండా ఈ సినిమాలో నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డును కూడా అందుకున్నారు.

ఈ సినిమాతో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో (Mahesh Babu)పాన్ వరల్డ్ మూవీని రాజమౌళి ఇప్పుడు చేస్తున్నారు.

ఈ సినిమాతో హాలీవుడ్ లో కూడా తన పేరు వినిపించేలా చేయడానికి జక్కన్న సిద్ధమయ్యారు.

ఇకపోతే రాజమౌళి తర్వాత టాలీవుడ్ నుంచి ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునే సత్తా ఉన్న యంగ్ దర్శకులు ఎవరంటే నలుగురు పేర్లు వినిపిస్తున్నాయి.వారిలో నాగ్ అశ్విన్(nag aswin) పేరు ఇప్పుడు స్ట్రాంగ్ గా వినిపిస్తోంది.

ఈయన డార్లింగ్ ప్రభాస్ (Prabhas) హీరోగా పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ సినిమా జూన్ 27న రిలీజ్ కాబోతోంది.ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి.

కచ్చితంగా ఈ సినిమా వరల్డ్ వైడ్ గా వండర్స్ క్రియేట్ చేస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఇప్పటికే మహానటి సినిమాతో నేషనల్ వైడ్ గా నాగ్ అశ్విన్ దర్శకుడిగా తన టాలెంట్ చూపించాడు.

Telugu Hanuman, Mahesh Babu, Nag Aswin, Prashant Verma, Rajamouli, Sandeepreddy,

ఇప్పుడు కల్కి హిట్ అయితే అతని పేరు వరల్డ్ వైడ్ గా రీ సౌండ్ చేయడం గ్యారెంటీ.ఆ తర్వాత వినిపిస్తున్న పేరు యంగ్ డైరెక్టర్ సుజిత్.ఇప్పటికే సాహో (Saaho) మూవీతో పాన్ ఇండియా దర్శకుడిగా ఎంటర్ అయ్యాడు.అయితే ఆ సినిమా మేకింగ్ పరంగా సూపర్ అనిపించుకున్న స్టోరీ పరంగా కొంత నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.

ఇప్పుడు ఓజీ (OG )మూవీతో మేకింగ్ తో పాటు స్టోరీ పరంగా బెస్ట్ అనిపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు.ఈ సినిమాపై హోప్స్ ఎక్కువగానే ఉన్నాయి.

Telugu Hanuman, Mahesh Babu, Nag Aswin, Prashant Verma, Rajamouli, Sandeepreddy,

సుజిత్ మంచి టాలెంటెడ్ డైరెక్టర్ అనే పేరు ఇప్పటికే ఉంది.కరెక్ట్ గా రెండు, మూడు హిట్స్ పడితే జక్కన్న రేంజ్ అందుకుంటాడని భావిస్తున్నారు.యానిమల్ మూవీతో సందీప్ రెడ్డి (Sandeep Reddy)వంగా తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు.ఒక వర్గం సందీప్ రెడ్డి క్రియేటివిటీ, అతని కథలని తప్పు పడుతున్న మెజారిటీ ఆడియన్స్ ఇంటరెస్ట్ చూపిస్తున్నారు.

నెక్స్ట్ సందీప్ రెడ్డి ప్రభాస్ తో స్పిరిట్ మూవీ చేస్తున్నాడు.ఈ సినిమాతో నెక్స్ట్ లెవల్ కి వెళ్తాడని భావిస్తున్నారు.అలాగే హనుమాన్(Hanuman) తో పాన్ ఇండియా డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్న ప్రశాంత్ వర్మ(Prashant Verma) కూడా రాజమౌళి రేంజ్ కి వెళ్తాడని భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube