తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డికి( Mallareddy ) మరో షాక్ తగిలింది.శామీర్ పేట మండలం( Shamirpeta Mandal ) ఎఫ్టీఎల్ లో నిర్మించిన ప్రహరీ గోడను ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారులు కూల్చివేస్తున్నారు.
చెరువు ఎఫ్టీఎల్ లో అక్రమంగా నిర్మాణాలు( Illegal Constructions ) చేపట్టారంటూ మల్లారెడ్డిపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తాయి.దీంతో రంగంలోకి దిగిన అధికారులు బొమ్రాసిపేట్ పెద్ద చెరువు ఎఫ్టీఎల్ లో నిర్మించిన ప్రహరీ గోడను జేసీబీల సాయంతో కూల్చివేశారు.
కాగా ఇరిగేషన్ మరియు రెవెన్యూ అధికారుల సమక్షంలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి.