1985 ఎయిరిండియా విమానంపై బాంబు దాడి ఘటనకు సంబంధించి నిర్దోషిగా విడుదలైన రిపుదమన్ సింగ్ మాలిక్( Ripudaman Singh Malik ) కుమారుడు హర్దీప్ సింగ్ మాలిక్‌కు( Hardeep Singh Malik ) రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ (ఆర్సీఎంపీ) హెచ్చరిక జారీ చేసింది.ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని అధికారులు ఆ లేఖలో పేర్కొన్నారు.2022లో అతని తండ్రి రిపుదమన్ మాలిక్ దారుణహత్య నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులపై అభియోగాలు మోపినట్లు సీబీఎస్ న్యూస్ నివేదించింది.ఖచ్చితమైన సాక్ష్యం లేనప్పటికీ సీబీఎస్ న్యూస్ నివేదిక ప్రకారం.
గతేడాది జూన్‌లో ఖలిస్తాన్ వేర్పాటువాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్( Hardeep Singh Nijjar ) హత్య మాదిరే రిపుదమన్ హత్య కేసులో భారత ప్రభుత్వ ప్రమేయం ఉందా అనే కోణంలో ఆర్సీఎంపీ( Royal Canadian Mounted Police ) పరిశోధకులు దర్యాప్తు చేస్తున్నారని పేర్కొంది.
హర్దీప్ మాలిక్‌కు జారీ చేసిన హెచ్చరిక ‘‘ డ్యూటీ టు వార్న్ ప్రోటోకాల్ ’’( Duty to Warn Protocol ) కిందకు వస్తుంది.
బ్రిటీష్ కొలంబియా పౌరుల భద్రత ప్రమాదంలో ఉన్నప్పుడు వారిని అప్రమత్తం చేయడానికి అధికారులు ఇలాంటి చర్యలు తీసుకుంటారు.ఈ ముప్పు కార్యరూపం దాల్చే అవకాశం ఉన్నట్లుగా భావించాలని ఆర్సీఎంపీ ఆయనను హెచ్చరించింది.
హర్దీప్కే కాదు.బ్రిటీష్ కొలంబియాలోని ఖలిస్తాన్ వేర్పాటువాద ఉద్యమంతో సంబంధం వున్న ఇతరులను కూడా హెచ్చరిస్తున్నారు.

కాగా.36 ఏళ్ల క్రితం 1985 జూన్ 23న ఎయిరిండియా విమానం( Air India Flight ) 182లో (కనిష్క) అట్లాంటిక్ మహా సముద్రంలో కూలిపోయి 329 మంది మరణించిన సంగతి తెలిసిందే.ఈ ఘటనలో ఉగ్రవాదులకు నిధులు సమకూర్చినట్లు అనుమానితుడిగా వున్న రిపుదమన్ సింగ్ మాలిక్ 2022 జూలై 14న కెనడాలో దారుణ హత్యకు గురయ్యాడు.వాంకోవర్ సమీపంలో గుర్తు తెలియని ముష్కరులు మాలిక్‌పై కాల్పులు జరిపారు.
ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.

1985లో కనిష్క విమాన ప్రమాదం సంభవించిన సమయంలో భారత్, కెనడాలలో ఖలిస్తాన్ ఉద్యమం తీవ్రంగా వుంది.ఈ ఘోర దుర్ఘటన వెనుక ఖలిస్తాన్ వేర్పాటువాద సంస్థ బబ్బర్ ఖల్సా వున్నట్లుగా అనేక అనుమానాలు, కథనాలు వచ్చాయి.అయితే ఈ ఘటనలో మాలిక్ ను దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకొన్నాయి.2005లో నిర్దోషిగా ప్రకటించబడిన తర్వాత … ఆయన పేరును బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించారు.