రోజు నైట్ ఈ క్రీమ్ రాస్తే స్పాట్‌లెస్ స్కిన్ మీసొంతం అవుతుంది!

స్పాట్ లెస్ స్కిన్ కావాలని ఎవరు కోరుకోరు చెప్పండి.అమ్మాయిలే కాదు దాదాపు అబ్బాయిలు సైతం అదే కోరుకుంటారు.

 If You Apply This Cream Before Bed You Will Have A Spotless Skin! Cream, Homemad-TeluguStop.com

కానీ ఏదో ఒక కారణం వల్ల ముఖంపై ఎక్కడో ఒకచోట మచ్చ పడుతూనే ఉంటుంది.ఆ మచ్చలను కవర్ చేసుకునేందుకు నానా పాట్లు పడుతుంటారు.

కొందరైతే ఏవో ట్రీట్మెంట్స్ కూడా చేయించుకుంటారు.కానీ ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ క్రీమ్ ని రోజు వాడితే కనుక ఎలాంటి మచ్చలు అయినా మాయమై స్పాట్ స్కిన్ మీ సొంతం అవుతుంది.

మరి ఇంతకీ ఆ క్రీమ్ ను ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల వైట్ రైస్, పది పుదీనా ఆకులు, ఐదు తులసి ఆకులు వేసుకుని వాటర్ తో ఒకసారి వాష్ చేయాలి.

అనంతరం ఒక గ్లాస్ వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు ఉదయాన్నే మిక్సీ జార్‌ తీసుకుని అందులో నానపెట్టుకున్న బియ్యం, తులసి ఆకులు, పుదీనా ఆకులు వేసుకుని కొద్దిగా వాటర్ పోసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేయాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఆరెంజ్ జెల్, సపరేట్ చేసి పెట్టుకున్న రైస్-తులసి-పుదీనా జ్యూస్, రెండు చుక్కలు పెప్పర్ మెంట్ ఎసెన్షియల్ ఆయిల్, హాఫ్‌ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకొని అన్నీ కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటే హోమ్ మేడ్ క్రీమ్ సిద్ధమవుతుంది.

Telugu Tips, Cream, Homemade Cream, Latest, Skin Care, Skin Care Tips, Spotless

ఈ క్రీమ్‌ను ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.నైట్ నిద్రించే ముందు ఈ క్రీమ్ ముఖానికి అప్లై చేసి సున్నితంగా రెండు నిమిషాల పాటు వేళ్ళతో మసాజ్ చేసుకోవాలి.ఇలా ప్రతిరోజు కనుక చేస్తే మచ్చలన్నీ మాయమై ముఖం అందంగా మరియు ఆకర్షణీయంగా మారుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube