మునుగోడు ఉపఎన్నికకు నామినేషన్ల గడువు నేటితో ముగిసింది.కాగా ఈ ఉపఎన్నికలో నామినేషన్లు వందకు పైగా నమోదు అయ్యాయి.
రేపు, ఎల్లుండి అధికారులు నామినేషన్లను పరిశీలించనున్నారు.ఈనెల 17 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది.
వచ్చే నెల 3న పోలింగ్, 6 న కౌంటింగ్ జరగనుంది.ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసి ముమ్మరంగా ప్రచారాలు కొనసాగిస్తున్నారు.
అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిలు నామినేషన్లను దాఖలు చేశారు.