వైరల్ వీడియో: హోటల్లో రోబో సేవలు.. ఆశ్చర్యపోయిన యూట్యూబర్..

టెక్నాలజీ ( Technology )రూపాంతరం చెందుతున్న కొద్ది ప్రపంచంలో రోజురోజుకీ సరికొత్త వినూత్న ఆవిష్కరణలు చూస్తూనే ఉన్నాం.ఇందుకు సంబంధించి అనేక విషయాలు సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు మనం చూస్తూనే ఉంటున్నాం.

 Youtuber Surprised By Robot Services In Viral Video Hotel, Robot In China ,deliv-TeluguStop.com

ఇకపోతే ఈ టెక్నాలజీ డెవలప్ చేసే క్రమంలో కొన్ని దేశాలు మిగతా దేశాల కంటే చాలా ముందున్నాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.ముఖ్యంగా జపాన్, చైనా( Japan, China ) లాంటి మరికొన్ని దేశాలు టెక్నాలజీని ఉపయోగించడంలో చాలా ముందు వరుసలో ఉన్నాయని చెప్పవచ్చు.

ఇందులో భాగంగానే తాజాగా ఓ వీడియోలో రోబో వచ్చి డెలివరీ ఇచ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.ఈ వీడియో సంబంధించి వివరాలు చూస్తే.

వైరల్ గా మారిన వీడియోలో హోమ్ డెలివరీ చేయడానికి ఒక రోబోట్ రాగా దానిని అందుకున్న వ్యక్తి ఆనందంతో గంతులు వేస్తూ ఆశ్చర్యంలో మునిగిపోయాడు.ఈ సంఘటన చైనా దేశంలో జరిగింది.చైనాలోని ఓ హోటల్లో బస చేసేందుకు వెళ్లిన ఓ భారత దేశ యూట్యూబర్ తన కావాల్సిన దానిని ఆర్డర్ చేసుకోగా., ఆ సమయంలో దానిని ఓ రోబోట్ ఇవ్వడంతో అతను ఒకింత షాక్ గురయ్యాడు.

తన డెలివరీని రోబోట్( Robot ) తీసుకో వచ్చిందని అని తెలియగానే అతడు గట్టిగా అరుస్తూ ఆనందంతో అల్లరి చేశాడు.దాంతో అతడు వెంటనే తన కెమెరాను చూపిస్తూ చూడండి డెలివరీ ఇవ్వడానికి ఎవరు వచ్చారు.

రోబో వచ్చింది మీరు చూడండి అంటూ కెమెరాతో చెప్తాడు.అలా డెలివరీ ఇచ్చిన తర్వాత రోబోను చూపిస్తుండగానే తన పనీ పూర్తి కావడంతో అక్కడి నుంచి తిరిగి వెళ్లడానికి ప్రయత్నం చేస్తుంది.

రోబో తీసుకువచ్చిన దానిని అందుకున్న వ్యక్తి ఈ రోబోట్ నాకు వస్తువులు డెలివరీ చేయడానికి వచ్చిందని తెలిపారు.రోబో తెలుగు వెళ్తుండగా అప్పుడు ఆ వ్యక్తి మీరు కూడా దానితో మాట్లాడవచ్చునని చెబుతుండగా రోబోట్ కి బాయ్ చెప్పే సమయంలో అతను ఏ సేమ్ బై బై అని తెలిపారు.దాంతో ఆగకుండా రోబోట్ ను అనుసరిస్తూ ముందుకు వెళ్లాడు.దాంతో కొద్దిసేపటి తర్వాత రోబోట్ లిఫ్టు కోసం వేచి ఉందా అనుకుంటూ ఉండగా కెమెరా మాన్ రోబో లిఫ్టులోకి వెళ్తున్న వీడియోని రికార్డు చేస్తుండగా రోబో లోపల వెళ్ళిన తర్వాత వీడియో ముగుస్తుంది.

దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఇక వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube