టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన చిత్రం గుంటూరు కారం.( Guntur Karam ) శ్రీ లీలా ఇందులో హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల ఈ ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది.కానీ ఈ సినిమాలో కుర్చీ మడత పెట్టి అనే సాంగ్ మాత్రం యూట్యూబ్‌లో సెన్సేషన్ ను క్రియేట్ చేసింది.
సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ పాటకు స్టెప్పులు వేశారు.అసలు గుంటూరు కారంలో సినిమాలో ఈ పాటను పెట్టడానికి కారణంగా ఓ తాత.ఆయన అసలు పేరు అహ్మద్ పాషా.( Ahmed Pasha )
హైదరాబాద్‌లో కృష్ణకాంత్ పార్క్ పరిసరాల్లో తిరుగుతూ ఉంటాడు.ఈ తాత చెప్పిన ఒకే ఒక్క డైలాగ్ తో ఈ పాట బాగా ఫేమస్ అయింది.ఇతనికి భార్య, పిల్లలు ఉన్నారు.
అయినప్పటికీ ఇంట్లో వాళ్లని పట్టించుకోకుండా ఇలా రోడ్లపైనే తిరుగుతూ వాళ్లనీ వీళ్లని తిడుతూంటాడు.ఈ క్రమంలో కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ఆ తాత తిట్టే బూతుల్ని వైరల్ చేశారు.
ఇతని డైలాగ్ కుర్చీని మడతపెట్టి బాగా పాపులర్ అయ్యింది.అది కాస్తా థమన్ చెవిన పడటంతో ఆయన తన గుంటూరు కారంలో పెట్టించేశాడు.
అంతేకాదు ఆ పదాన్ని సినిమాలో వాడుకున్నందుకు గాను కాలాపాషాను ఇంటికి పిలిపించి ఆర్ధిక సాయం చేశాడు థమన్.అలా తెలుగు నాట కుర్చీ తాత( Kurchi Thatha ) రాత్రికి రాత్రే సెలబ్రెటీ అయ్యాడు.
ఈ క్రమంలో జనవరి 24న కాలాపాషాను పోలీసులు అరెస్ట్ చేశారు.వైజాగ్ సత్య అనే సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్.ఇతని వల్లే తనకు అంతటి గుర్తింపు వచ్చిందని చెప్పిన కుర్చీ తాత తర్వాత యూటర్న్ తీసుకున్నాడు.వైజాగ్ సత్య తన పేరును ఉపయోగించుకుని డబ్బులు సంపాదిస్తున్నాడని.వాడు నాకు కనిపిస్తే నరికేస్తా, చంపేస్తానంటూ వీడియోలు చేశాడు.దీంతో వైజాగ్ సత్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
థమన్ దగ్గరికి తీసుకెళ్లినట్లే మహేశ్ బాబు ( Mahesh Babu ) దగ్గరికి కూడా తీసుకెళ్లాలని కుర్చీ తాత పట్టుబెట్టాడట.అది సాధ్యం కాదని చెప్పడం వల్లే కాలా పాషా తనను టార్గెట్ చేస్తున్నాడని వైజాగ్ సత్య( Vizag Satya ) పేర్కొన్నాడు.
ఈ వివాదం తర్వాత కుర్చీతాత కనిపించలేదు.తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్లో ఆయన మెరిశారు.
జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న దేవర ( Devara ) నుంచి ఇటీవల ఫియర్ సాంగ్‌ను ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ విడుదల చేశారు.రామజోగయ్య రాసిన ఈ పాటలోని లైన్స్ ఎన్టీఆర్ పాత్ర ఎలాంటిదో తెలియజేస్తున్నాయి.ఈ సాంగ్‌పై కుర్చీతాత రివ్యూ ఇచ్చారు.ఎన్టీఆర్ యాక్షన్, అతను కత్తిపట్టి నరికే సీన్ తనకు బాగా నచ్చాయని చెప్పారు.తన దృష్టిలో ఎన్టీఆర్, ప్రభాస్‌లు మాత్రమే కత్తి పట్టుకుంటే బాగుంటుందని దేవర ఖచ్చితంగా 150 రోజులపైనే ఆడుతుందని కుర్చీ తాత జోస్యం చెప్పారు.ఎన్టీఆర్ చాలా మంచోడని, ఆడపిల్లకు, అనాథలకు హెల్ప్ చేస్తాడని ప్రశంసించారు.
ఇదే సమయంలో అల్లు అర్జున్‌పైనా( Allu Arjun ) సెన్షేషనల్ కామెంట్స్ చేశాడు కుర్చీ తాత.బన్నీ చేసిందే చేస్తాడని, కొంచెం మారాలని .కొడుకుతో ఓవర్ యాక్టింగ్ చేయించొద్దని అల్లు అరవింద్‌కు కాలాపాషా హితవు పలికాడు.