యూకే : విదేశీ ప్రభుత్వాధికారికి లంచం .. భారత సంతతి వ్యాపారవేత్తపై అభియోగాలు

విదేశీ ప్రభుత్వ అధికారికి లంచం ఇచ్చిన కేసుపై భారత సంతతికి చెందిన బ్రిటీష్ వ్యాపారవేత్తపై అభియోగాలు మోపారు. యూకే నేషనల్ క్రైమ్ ఏజెన్సీ( UK National Crime Agency ) ఈ కేసును విచారిస్తోంది.

 British Businessman Of Indian Origin Charged With Bribing Foreign Public Officia-TeluguStop.com

నిందితుడిని హర్దీప్ సింగ్ అలియాస్ పీటర్ విర్డీ( Hardeep Singh alias Peter Virdy ) (50)గా గుర్తించారు.అతనితో పాటు అతను డైరెక్టర్‌గా ఉన్న కంపెనీపైనా అభియోగాలు మోపి వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు.

జూన్ 20న సౌత్‌వార్క్ క్రౌన్‌ కోర్టు ముందు హాజరుకావడానికి గాను హర్దీప్‌ను బెయిల్‌పై విడుదల చేశారు.

Telugu Asot Michael, Hardeepsingh, Energy-Telugu Top Posts

జనవరి 2015 నుంచి జూలై 2017 మధ్య కాలంలో హర్దీప్ సింగ్ ఆంటిగ్వా, బార్బుడాకు టూరిజం, ఎకనామిక్ డెవలప్‌మెంట్ ఇన్వెస్ట్‌మెంట్, ఎనర్జీ మంత్రి అయిన అసోట్ మైఖేల్‌కు( Asot Michael, Minister of Energy ) లంచం ఇచ్చాడు.తద్వారా తాను డైరెక్టర్‌గా ఉన్న పీవీ ఎనర్జీ లిమిటెడ్‌కు హర్దీప్ ప్రయోజనం చేకూర్చాడని ఎన్‌సీఏ ఆరోపించింది.లంచం ఇవ్వకుండా హర్దీప్‌ను నియంత్రించడంలో విఫలమైనందుకు సదరు కంపెనీపైనా అభియోగాలు మోపినట్లు పేర్కొంది.

కోర్టు పత్రాల ప్రకారం బ్రైబరీ యాక్ట్ 2010లోని సెక్షన్ 6కు విరుద్ధంగా విదేశీ ప్రభుత్వ అధికారికి లంచం ఇచ్చినట్లు విర్డీపైనా అభియోగాలు మోపారు.అదే చట్టంలోని సెక్షన్ 7, 11(3) ప్రకారం లంచాన్ని అడ్డుకోలేకపోయినందుకు పీవీ ఎనర్జీపైనా అభియోగాలు మోపారు.

Telugu Asot Michael, Hardeepsingh, Energy-Telugu Top Posts

ఇదిలావుండగా.లంచం, పన్ను ఎగవేతకు పాల్పడినందుకు గాను భారతీయ అమెరికన్ వ్యాపారవేత్తకు 18 నెలల పరిశీలన, 200 గంటల కమ్యూనిటీ సర్వీస్ శిక్ష విధించినట్లుగా గత నెలలో ఆ దేశ న్యాయశాఖ తెలిపింది.అర్మాన్ అమీర్షాహి( Armaan Amirshahi ) (46) మేరీలాండ్‌లోని క్యాపిటల్ హైట్స్‌కు చెందిన సహ కుట్రదారులు ఆంథోనీ మెరిట్, డీసీ ఆఫీస్ ఆఫ్ టాక్స్ అండ్ రెవెన్యూ (ఓటీఆర్)లో మాజీ మేనేజర్ విన్సెంట్ స్లేటర్ నేతృత్వంలో లంచం స్కామ్‌లలో పాలు పంచుకున్నాడు.స్కీమ్‌లలో భాగంగా.

అమీర్‌షాహి, చార్లెస్ జౌ, ఆండ్రీ డి మోయా, దావూద్ జాఫారీలతో సహా నలుగురు వ్యాపార యజమానులు తమ వ్యాపార పన్నులను ఎగవేసేందుకు స్లేటర్‌కు మధ్యవర్తిగా నగదు చెల్లించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube