హైదరాబాద్ లో అంతర్జాతీయ కిడ్నీ రాకెట్( International Kidney Racket ) ముఠా గుట్టు రట్టైంది.హైదరాబాద్ నుంచి కొచ్చి మీదుగా ఇరాన్( Iran ) కు కిడ్నీ దందా సాగుతున్నట్లు పోలీసులు నిర్ధారించారు.
ఈ క్రమంలోనే కిడ్నీ దందాలో కేరళకు చెందిన ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారని తెలుస్తోంది.అదేవిధంగా ఈ వ్యవహారంలో హైదరాబాద్ కు చెందిన డాక్టర్ ప్రమేయం ఉందని తేలినట్లు సమాచారం.
పేద యువకులకు డబ్బు ఆశ చూపించే ముఠా వారిని ఇరాన్ తీసుకెళ్లి ఆపరేషన్లు చేయించినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఒక్కో కిడ్నీకి రూ.20 లక్షలు ఇస్తామని చెప్పి రూ.6 లక్షలే ఇస్తున్నట్లుగా తెలుస్తోంది.ఈ తరహాలోనే మొత్తం 40 మంది యువకులకు కిడ్నీ మార్పిడి చేయించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.అయితే కిడ్నీ ఇచ్చిన యువకుడు కొద్ది రోజుల క్రితం మరణించాడు.
బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.కిడ్నీ రాకెట్ వ్యవహారంలో కీలక సూత్రధారులు హైదరాబాద్ కు చెందిన వారిగా కేరళ పోలీసులు గుర్తించారు.