గోళ్లు పెళుసుగా మారకుండా ఉండాలంటే....

చాలా మందికి గోళ్లు పెళుసుగా మారి విరిగిపోతూ ఉంటాయి.ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే కొన్ని ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవాలి.

 Tips For Healthy Nails-TeluguStop.com

శరీరంలో బయోటిన్ లోపించినప్పుడు ఈ సమస్య ఎదురు అవుతుంది.ఈ లోపాన్ని అధికమించాలంటే బయోటిన్ సమృద్ధిగా లభించే ఆహారాలను తీసుకోవాలి.

బీన్స్, క్యాలీఫ్లవర్,గుడ్లు,ఎర్ర కందిపప్పు,చేపలు,బఠాణిలను ఎక్కువగా తీసుకుంటే మన శరీరానికి అవసరమైన బయోటిన్ అందుతుంది.

గోళ్లు పెళుసుగా మారినప్పుడు ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి.

ఫ్యాటీ ఆమ్లాలు సమృద్ధిగా ఉన్న అవిసె గింజలు,చేప నూనె,పాలకూర,వాల్నట్స్ వినియోగాన్ని పెంచాలి.

ప్రోటీన్స్ లోపం వలన కూడా గోళ్ళ సమస్యలు వస్తాయి.

ఈ సమస్యలు దూరం కావాలంటే ప్రోటీన్స్ సమృద్ధిగా లభించే వెన్న తీసిన పాలు, చికెన్,పప్పులు,సొయా బీన్ వంటి పదార్ధాలు తీసుకోవాలి.

గోళ్లు ఆరోగ్యంగా ఉండటానికి విటమిన్ ‘ఏ’ బాగా సహాయపడుతుంది.

అందువల్ల విటమిన్ ఏ సమృద్ధిగా లభించే గుడ్డు తెల్లసొన,ఆప్రికాట్స్,ఓట్ మీల్, తోటకూర వంటి ఆహారాలను తీసుకోవాలి.

గోరువెచ్చని ఆలివ్ ఆయిల్ ని గోళ్లకు మసాజ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు