శ్రీకృష్ణుడు అష్ట భార్యలు గురించి తెలుసా?

శ్రీకృష్ణుడికి ఎనిమిది మంది భార్యలు అని అందరికి తెలుసు.అయితే వారి గురించిన వివరాలు మాత్రం చాలా మందికి పూర్తిగా తెలియదు.

ఇప్పుడు వారి గురించి తెలుసుకుందాం.1.రుక్మిణి విదర్భరాజు భీష్మకుని కూతురు.వాళ్ళ అన్న రుక్మిని ఎదిరించి కృష్ణుణ్ణి వివాహం చేసుకుంది.2.సత్యభామ సత్రాజిత్తు కూతురు.కృష్ణుణ్ణి అపనిందలకి గురి చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా తన కుమార్తెను ఇచ్చి వివాహం చేసెను.3.జాంబవతి జాంబవంతుడికి అడవిలో ఒక పాప దొరికితే తెచ్చి జాంబవతి అని పేరు పెట్టి పెంచుకున్నాడు.కృష్ణుడు సత్రాజిత్తు పోగొట్టుకున్న శమంతకమణిని వెతికితెచ్చే ప్రయత్నంలో జాంబవంతునితో యుద్ధంచేసి గెలిచిన తర్వాత జాంబవతిని వివాహం చేసుకున్నాడు.4.మిత్రవింద అవంతి రాజుకు తోబుట్టువు.

ఆమెకు శ్రీకృష్ణుడు అంటే విపరీతమైన ప్రేమ.ఆ కారణంగా మిత్రవింద స్వయంవరంలో శ్రీకృష్ణుడు ఆమెను అపహరించి వివాహం చేసుకొనెను.5.కాళింది ఈమె సూర్యుని కుమార్తె.విష్ణువుని భర్తగా కోరి తపస్సు చేస్తే ఈ కృష్ణ అవతారంలో ఆమె కోరికను తీర్చాడు.6.నాగ్నజిత్తి కోసలరాజు నగ్నజిత్తు కుమార్తె.

అసలు పేరు సత్య.ఈ రాజు తన దగ్గరున్న బలమైన ఏడు గిత్తల్ని ఎవరు లొంగదీసుకుంటే వారికీ తన కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తానని వీర్యశుల్కం ఏర్పాటుచేశాడు.కృష్ణుడు ఆ పనిచేసి నాగ్నజితిని వివాహం చేసుకొనెను.7.భద్ర కృష్ణుని మేనత్త శృతకీర్తి కూతురు.ఆమెను స్వయంవర మండపం నుండి ఎత్తుకువెళ్లి వివాహం చేసుకొనెను.8.లక్ష్మణ మద్రదేశ రాకుమారి.

స్వయంవరంలో మత్స్యయంత్రాన్ని ఛేదించి వివాహం చేసుకొనెను.

Advertisement
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

తాజా వార్తలు