C.D మూవీ రివ్యూ.. భయపెట్టిన అదా శర్మ!

హారర్, సస్పెన్స్, క్రైమ్ డ్రామాల కాలం నడుస్తోంది ఇప్పుడు.ఆ జానర్లో వచ్చే సినిమాలు థియేటర్లో, ఓటీటీల్లో బాగానే ఆడుతున్నాయి.

 C.d మూవీ రివ్యూ.. భయపెట్టిన అదా శ�-TeluguStop.com

ఈ క్రమంలోనే అదా శర్మ( Ada Sharma ) హీరోయిన్‌గా, విశ్వంత్ హీరోగా నటించిన చిత్రం C.D క్రిమినల్ ఆర్ డెవిల్( C.D Criminal or Devil ).ఈ మూవీకి కృష్ణ అన్నం దర్శకత్వం వహించారు.ఈ చిత్రాన్ని SSCM ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు.ఈ చిత్రం నేడు థియేటర్లోకి వచ్చింది.మరి ఈ మూవీ ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

కథ

సిద్దు( Siddhu ) (విశ్వంత్) చాలా భయస్థుడు.ఓ సారి ఇంట్లో ఒంటరిగా ఉండాల్సి వస్తుంది.బంధువులు పెళ్లి కావడంతో అమ్మానాన్నలు ఊరికి వెళ్తే ఇంట్లో ఒక్కడే ఉంటాడు.సిద్దు ఇంట్లో పని మనిషి (జబర్దస్త్ రోహిణి) అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటుంది.ఇక సిద్దుకి దెయ్యాలు అంటే చాలా భయం.సిద్దు ఒంటరిగా ఉన్న ఆ టైంలోనే డెవిల్ అనే దెయ్యం సినిమా చూసి భయపడుతుంటాడు.సినిమా చూస్తుంటే అందులోని దెయ్యం వచ్చి తననే చంపేస్తోందని హడలెత్తిపోతాడు.

ఇలా సిద్దు ఇంట్లో ఒంటరిగా ఉంటున్న టైంలోనే పక్కింటి ఎన్నారై అమ్మాయిగా రక్ష (అదా శర్మ) వస్తుంది.సిటీలో అమ్మాయిలను కిడ్నాప్ చేస్తున్న సైకో ఎవరు? ఈ విశ్వంత్ ఇంట్లో ఇలా ఎందుకు ప్రవర్తిస్తుంటాడు? రక్ష వచ్చాక విశ్వాంత్ ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి? అసలు రక్ష ఎవరు? అన్నది థియేటర్లో చూడాల్సిందే.

Telugu Adha Sharma, Cd, Cd Review, Cdreview, Criminal, Criminal Devil, Criminald

నటీనటులు

అదా శర్మకు ఇలాంటి పాత్రలు కొట్టిన పొండి.రక్ష పాత్రలో అందరినీ భయపెట్టేస్తుంది.చూపుల్తోనే అందరిలోనూ వణుకు పుట్టించేస్తుంది.

ఎక్స్‌ప్రెషన్స్‌కి అందరూ భయపడిపోవాల్సిందే.యాక్షన్ సీక్వెన్స్‌లో అదరగొట్టేస్తుంది.

ఇక విశ్వంత్ అయితే తన వేరియేషన్స్ చూపించాడు.విశ్వంత్ ( Viswanth )పాత్ర ఈ సినిమాకు హైలెట్ అవుతుంది.

ఇక ఇందులో రోహిణి అప్పుడప్పుడు కనిపించి తెగ నవ్వించేస్తుంది.పోలీస్ ఆఫీసర్‌గా భరణి మెప్పిస్తాడు.

ఇక మిగిలిన పాత్రలు పర్వాలేదనిపిస్తాయి.

Telugu Adha Sharma, Cd, Cd Review, Cdreview, Criminal, Criminal Devil, Criminald

విశ్లేషణ

సి.డి సినిమా కోసం దర్శకుడు రాసుకున్న కథ, అందులో జొప్పించిన అంశాలు బాగానే ఉన్నాయి.ఈ మూవీ కోసం తీసుకున్న పాయింట్ కొత్తగా ఉంటుంది.హారర్, సస్పెన్స్, కామెడీ, థ్రిల్లింగ్ ఇలా అన్ని అంశాలను జొప్పించి కథను రాసుకున్నాడనిపిస్తుంది.అయితే ఈ చిత్రం అంతా ఒకే చోట జరుగుతుంది.దీంతో కథలో అంతగా ముందుకు సాగుతున్నట్టుగా అనిపించదు.

కానీ గ్రిప్పింగ్‌గా తీసుకెళ్లడం, భయపెట్టడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.కొన్ని ఇల్లాజికల్ సీన్లలా అనిపిస్తాయి.

కానీ వాటికి అర్థం చివర్లో తెలుస్తుంది.ఇంటర్వెల్ కూడా కాస్త ఇంట్రెస్టింగ్‌గానే సాగుతుంది.

Telugu Adha Sharma, Cd, Cd Review, Cdreview, Criminal, Criminal Devil, Criminald

సెకండాఫ్‌లో హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సన్ని వేశాలు కొన్ని రొమాంటిక్‌గా అనిపిస్తే.ఇంకొన్ని సార్లు హారర్ ఎలిమెంట్స్‌ని తలపిస్తాయి.ఇక మధ్య మధ్యలో రోహిణి పాత్ర చేసే కామెడీ నవ్విస్తుంది.

చివర్లో ఇచ్చిన ట్విస్ట్ బాగుంటుంది.నగరంలో అమ్మాయిల మిస్సింగ్‌ విషయంలో చివరన ఇచ్చిన ట్విస్ట్ అందరినీ ఆకట్టుకుంటుంది.

చివర్లో వచ్చే ట్విస్ట్‌కు అందరూ ఆశ్చర్యపోవడం మాత్రం ఖాయం.సి.డి సినిమాకు సంగీతమే మేజర్ అస్సెట్.మూడ్‌కు తగ్గట్టుగా నవ్వించాడు.

భయపెట్టాడు.సినిమాటోగ్రఫీ చక్కగా ఉంది.

ఎడిటింగ్ ఓకే అనిపిస్తుంది.తక్కువ లొకేషన్లలో సినిమా తీసి మంచి అవుట్‌ను నిర్మాతకు అందించారు.ఈ మూవీ మరీ ముఖ్యంగా ఓటీటీ ఆడియెన్స్‌ను కట్టి పడేసేలా ఉంది.

రేటింగ్: 3/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube