అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంటున్న 'ది వారియర్' ట్రైలర్!

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరోల్లో రామ్ పోతినేని ఒకరు.ఈయన పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు లేరు.

 Ram Pothineni The Warrior Trailer Response Details, Ram Pothineni , The Warrior , Adi Pinchetti , Linguswamy, The Warrior Trailer, Ram The Warrior Trailer, Heroine Krithi Shetty, The Warrior Movie, Ram The Warrior, Srinivasa Silver Screen Banner-TeluguStop.com

ఇంతకు ముందు అమ్మాయిల కలల రాకుమారుడిలా ఉండేవాడు.కానీ ఇప్ప్పుడు ఇష్మార్ట్ శంకర్ సినిమాతో ఆయన తన లుక్ ని పూర్తిగా మార్చి చాకొలేట్ బాయ్ కాస్త యాక్షన్ హీరోగా మారిపోయి మాస్ ప్రేక్షకులకు దగ్గర అయ్యాడు.

ఈ సినిమా ఇచ్చిన జోష్ తో రామ్ మరిన్ని మాస్ అండ్ యాక్షన్ సినిమాలనే ఎంచుకుంటూ మాస్ ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యి మాస్ హీరో అనిపించు కోవడానికి బాగా ట్రై చేస్తున్నాడు.ఇందులో భాగంగానే రామ్ రెండు సినిమాలను లైన్లో పెట్టుకున్నాడు.

 Ram Pothineni The Warrior Trailer Response Details, Ram Pothineni , The Warrior , Adi Pinchetti , Linguswamy, The Warrior Trailer, Ram The Warrior Trailer, Heroine Krithi Shetty, The Warrior Movie, Ram The Warrior, Srinivasa Silver Screen Banner-అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంటున్న ది వారియర్#8217; ట్రైలర్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రామ్ కోలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ది వారియర్ సినిమా చేస్తున్నాడు.

ఇది ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతుంది.

రామ్ ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలిస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.

ఈ సినిమా నుండి ఇప్పటికే వచ్చిన పోస్టర్స్ అందరిని ఆకట్టుకున్నాయి.ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తూ ఉండగా.కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమాను జులై 14న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్టు ఇటీవలే మేకర్స్ అనౌన్స్ చేసారు.

రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రొమోషన్స్ స్టార్ట్ చేసారు మేకర్స్.ఈ క్రమంలోనే నిన్న మేకర్స్ ఈ సినిమా నుండి ట్రైలర్ రిలీజ్ చేశారు.ఈ మాస్ ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.కేవలం 12 గంటల్లోనే 73 లక్షలకు పైగానే వ్యూస్ సాధించి మంచి రెస్పాన్స్ అందుకుంది.12 గంటల్లోనే మిలియన్ వ్యూస్ కు దగ్గరగా వచ్చింది అంటే ఇది ఈ యంగ్ హీరోకు ఎక్కువనే చెప్పాలి.ఇక పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.మరి ఈ సినిమా రామ్ కు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో వేచి చూడాల్సిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube