తిరుమలలో నకిలీ బోర్డింగ్ పాసులు తీవ్ర కల్లోలం సృష్టించాయి.నకిలీ బోర్డింగ్ పాసులతో శ్రీవారి భక్తులు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్లను పొందినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో నకిలీ పాసులతో భక్తులు దర్శనానికి వచ్చినట్లు టీటీడీ విజిలెన్స్ అధికారులు గుర్తించారు.దీంతో రంగంలోకి దిగిన అధికారులు తిరుపతి ఎయిర్ పోర్టులో నకిలీ బోర్డింగ్ పాసులు జారీ చేసినట్లు నిర్ధారించారు.
ఓ అధికారి నకిలీ పాసులు సృష్టించారని విజిలెన్స్ తెలిపింది.కాగా శ్రీవాణి ట్రస్ట్ కు విరాళాలు ఇచ్చే దాతలకు బ్రేక్ దర్శనం టికెట్లు ఇచ్చారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో నకిలీ బోర్డింగ్ పాసులపై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.







