వరంగల్ జిల్లాలోని రుద్రమదేవి కూడలిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.ప్రజల కోసం సోనియా తెలంగాణ ఇచ్చారని తెలిపారు.
తెలంగాణ సంపద అంతా ఒక కుటుంబం చేతిలో చేరిందని రాహుల్ గాంధీ ఆరోపించారు.కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందన్న రాహుల్ గాంధీ ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోతున్నాయని తెలిపారు.
లక్ష కోట్ల తెలంగాణ ప్రజల ధనాన్ని కేసీఆర్ తన ఇంట్లో వేసుకున్నారని తీవ్రంగా ఆరోపణలు చేశారు.అంతేకాకుండా ధరణి పేరుతో పేదల భూములను లాక్కొంటున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎంతమందికి ఇచ్చారని ప్రశ్నించారు.ఈ క్రమంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు.