శుక్రవారం అమ్మవారికి ఎలా పూజ చెయ్యాలి?

శుక్రవారం శ్రీ మహాలక్ష్మిని పూజించడం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి, ఆ ఇంట సిరి సంపదలు, అనుకున్న కోరికలు నెరవేరుతాయి.మరి అలాంటి శుక్రవారం రోజు పూజ ఎలా చేయాలి? ఏ రంగు దుస్తులు ధరించాలి? ఏ పూలతో పూజ చేయాలి అన్నది మనం ఇక్కడ తెలుసుకుందాం.

 Friday Ammavari Pooja Methodology  Friday Pooja, Ammavari Pooja, Methodology, Te-TeluguStop.com

శుక్రవారం ఉదయం తలస్నానం చేసి పసుపు రంగు, ఎరుపు రంగు లేదా ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించాలి.శుక్రవారం పూజా కార్యక్రమాలు పూర్తిగా ముగించుకొని అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవాలి.

అక్కడ నేతి దీపం వెలిగించడం ద్వారా దీర్ఘసుమంగళీగా ప్రాప్తం చేకూరుతుంది.

శుక్రవారం రోజున మహిళలు నుదుటిన బొట్టు లేకుండా ఉండకూడదు.

శుక్రవారం అమ్మవారికి తెలుపు రంగు పువ్వులు లేదా మల్లె పూలతో పూజ చేయడం చాలా మంచిది.చక్కెర పొంగలి నైవేద్యం అమ్మవారికి ఎంతో ఇష్టం.

అందుకే నైవేద్యంగా చెక్కర పొంగలి పెడితే మంచి లాభాలు వస్తాయ్.

అమ్మవారి ఆలయంలో కర్పూరం వెలిగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

ఆలయంలో దీపం వెలిగించడానికి ఇతరుల నుండి అగ్గిపెట్టెను తీసుకోకూడదు.అలా తీసుకోవడం ద్వారా మీరు చేసిన పూజ పుణ్యఫలం అంతా ఇతరులకు దక్కుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube