శ్రావణ మాసంలోని( Shravana Masam ) శుక్లపక్ష పౌర్ణమి రోజున రక్షా బంధన్( Raksha Bandhan ) జరుపుకుంటారు.ఈ రోజున సోదరీమణులు తమ సోదరుడి మణికట్టుకి రాఖీ కడతారు.
అంతేకాకుండా రాఖీ( Rakhi ) కట్టిన తర్వాత సోదరులు తమ సోదరీమణులను కాపాడుతానని, వారి సోదరికి ఏదైనా బహుమతిగా ఇస్తానని హామీ ఇస్తారు.రక్షాబంధన్ రోజున చేయకూడని పనులు ఎన్నో ఉన్నాయి.
ఈ రోజున చేయకూడని పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే రక్షాబంధన్ రోజున అన్నదమ్ములు ఒకరితో ఒకరు గొడవ పడకూడదు.
ఒకరి పై ఒకరు కోపం తెచ్చుకోకూడదు.రక్షాబంధన్ రోజున ఏ కారణం చేతనైనా ఇంట్లో గొడవలు జరగడం మంచిది కాదు.

సోదరీమణులు( Sisters ) తమ సోదరుడికి రాఖీ కట్టేటప్పుదు నలుపు రంగును ఉపయోగించకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలి.రక్షాబంధన్ రోజున ఎవరైనా తన సోదరీ పాదాలను తాకి ఆశీర్వాదం పొందాలి.దీంతో పాటు అన్నదమ్ములు ఇంటి పెద్ద ఆశీస్సులు తీసుకోవాలి.సోదరులు తమ సోదరీమణులకు బహుమతులు ( Gifts ) ఇస్తే బహుమతిలో పదునైన వస్తువులు ఉండకూడదని గుర్తుపెట్టుకోవాలి.
అలాగే నలుపు రంగు బహుమతులు ఇవ్వకూడదు.రక్షాబంధన్ రోజు సోదరీమణులు శుభ సమయంలో మాత్రమే రాఖీ కట్టాలి.
భద్ర, రావువు కాలాలలో రాఖి కట్టకూడదు.

ఈ కాలంలో రాఖీ కడితే ఇద్దరికీ అశుభం జరుగుతుంది.ఇంకా చెప్పాలంటే రాఖీ కట్టేటప్పుడు సోదరుడి ముఖం తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండాలి.ఇంకా చెప్పాలంటే రక్షాబంధన్ రోజు పొరపాటున కూడా మాంసాహారం, మద్యం సేవించకూడదు.
రక్షాబంధన్ రోజు సోదరుడు లేదా సోదరీ ఎలాంటి అబద్ధం చెప్పకూడదు.ఇంకా చెప్పాలంటే రక్షాబంధన్ రోజున అక్క చెల్లెళ్ల రాఖీ కట్టే వరకు ఉపవాసం( Fasting ) ఉండే ఆచారం కూడా ఉంది.
ముఖ్యంగా చెప్పాలంటే రాఖీ కట్టే వరకు ఉప్పు అసలు తినకూడదు.
DEVOTIONAL