విభిన్న చిత్రాల దర్శకుల జాబితా లో ముందు ఉండే దర్శకుడు సుకుమార్( Director Sukumar ) మరోసారి తన సత్తా ను పుష్ప సినిమా తో( Pushpa ) చాటాడు.అల్లు అర్జున్ తో ( Allu Arjun ) రూపొందించిన పుష్ప సినిమా ఏకంగా రూ.400 కోట్ల వసూళ్లు నమోదు చేసిన విషయం తెల్సిందే.ఆ సినిమా యొక్క వసూళ్లు ప్రస్తుతం రూపొందుతున్న పుష్ప 2 యొక్క అంచనాలు ఆకాశానికి పెంచాయి అనడంలో సందేహం లేదు.
సుకుమార్ ఏకంగా రెండు సంవత్సరాల సమయం తీసుకుని పుష్ప 2 సినిమా ను రూపొందిస్తున్నాడు.పుష్ప సినిమా కోసం మొత్తంగా నాలుగు సంవత్సరాల సమయం ను సుకుమార్ కేటాయించాడు.

అంతకు ముందు రామ్ చరణ్ తో రంగస్థలం సినిమా ను రూపొందించిన విషయం తెల్సిందే.రంగస్థలం సినిమా తర్వాత అనుకోకుండా రెండేళ్ల గ్యాప్ వచ్చింది.దాంతో సుకుమార్ దర్శకత్వం లో పుష్ప 2 తర్వాత రూపొందబోతున్న సినిమా ఎప్పుడు.ఎవరి తో అనే చర్చ చాలా రోజులుగా జరుగుతోంది.రంగస్థలం తర్వాత జరిగినట్లుగా మరీ ఎక్కువ గ్యాప్ లేకుండా పుష్ప 2 సినిమా విడుదల అయిన వెంటనే కొత్త సినిమా ను సుకుమార్ మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి.ఇప్పటికే కొన్ని స్క్రిప్ట్ లు రెడీ గా ఉన్నాయి.వాటిల్లో ఒకటి రెండు స్క్రిప్ట్ లను ఎంపిక చేసుకుని

త్వరలోనే వాటిని తాను అనుకుంటున్న హీరో తో ఫైనల్ చేయించుకునే అవకాశం ఉంది.దాంతో పుష్ప 2 సినిమా విడుదల అయిన వెంటనే ఆ సినిమా మొదలు అయ్యే అవకాశాలు ఉన్నాయి.మొత్తానికి సుకుమార్ యొక్క తదుపరి సినిమా అనేది కచ్చితంగా పుష్ప 2 సినిమా తర్వాతే అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సుకుమార్ పుష్ప 2 సినిమా ను వచ్చే ఏడాది విడుదల చేస్తారా లేదంటే ఇదే ఏడాది చివర్లో విడుదల చేస్తారా అనేది అందరిలో కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది.







