ముఖ్యంగా చెప్పాలంటే ఆలయాలకు వెళ్ళినప్పుడు మూడు ప్రదిక్షణాలు చేయమని పండితులు చెబుతూ ఉంటారు.ఆంజనేయ స్వామి( Anjaneya Swami ) చుట్టూ 21 ప్రదక్షిణలు చేయమని చెబుతూ ఉంటారు.
హిందూ పురాణాలలో 21కి ఎంతో విశిష్టత ఉందని పండితులు చెబుతున్నారు.జాతకరీత్యా ఉన్న దోషాలు పోవాలంటే అర్థ మండల దీక్ష చేయాలని చెబుతూ ఉంటారు.
మండలము అనగా 42.ఆధ్యాత్మిక గ్రంథాలలో 21కి ఉన్న ప్రాధాన్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.కార్తీక మాసంలో శుక్లపక్షం పున్నమి తిధి కలిగినది 15వ రోజు.కార్తీక మాసంలో పౌర్ణమి రోజు ను చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.ఈ పౌర్ణమి రోజున ఆలయాలలో రుద్రాభిషేకం ( Rudrabhishekam )చేయించిన వారు సకల సంపదలను పొందుతారు.
మహన్యాసక పూర్వక రుద్రాభిషేకం, ఏకాదశి రుద్రాభిషేకాలను చేయించినట్లయితే కోటి జన్మల పుణ్యా ఫలం లభిస్తుందని ప్రజలు నమ్ముతారు.కార్తీక మాసంలో( karthikamasam ) వచ్చే పౌర్ణమిని హిందువులకు పరమ పవిత్రమైన రోజు అని చెప్పవచ్చు.ఇది మహా శివరాత్రి తో సమానమని పండితులు చెబుతున్నారు.
ఈ పర్వదినాన్ని త్రిపుర పూర్ణిమ, దేవ దీపావళి అని కూడా అంటారు.ముఖ్యంగా చెప్పాలంటే 21 పేటల పట్టు దారాన్ని ధరించాలి.21 మంది ద్విజులను పూజించిన తర్వాత ప్రతిమలోకి కేదారేశుని ఆవాహనం చేయాలి.పూజలో గోధుమపిండితో చేసిన 21 అరిసెలు, పాలు, పెరుగు, నెయ్యితో పాటు 21 రకాల ఫలాలను, కూరలను నైవేద్యంగా సమర్పించాలి.
ఇందులో తప్పనిసరిగా తేనె ఉండాలి.ఈ వ్రతంలో 21వ సంఖ్యకు ప్రాముఖ్యత ఎందుకంటే శిశువు పుట్టినప్పుడు 21 దోషాలు ఉంటాయి.
కేదారుని పూజించడం వల్ల ఈ దోషాలు దూరమైపోతాయి.మనం సమర్పించే నైవేద్య వస్తువులలో 21 దోషాలకు ఒక్కొక్కటి చొప్పున సమర్పణ చేస్తూ ఉంటాము.సంఖ్యాపరంగా 21ని ఏక సంఖ్య చేసినట్లయితే 3 వస్తుంది.ఈ మూడు అనేది త్రిమూర్తి మత్వానికి సంకేతం.అందుకే ఈ వతంలో 21వ సంఖ్యకు అంతటి ప్రాముఖ్యత ఉందని పండితులు చెబుతున్నారు.ఈ వ్రతాన్ని ఎగతాటిగా 21 సంవత్సరాలు పాటు నిర్వహిస్తే 21వ సంవత్సరపు పూజాంతంలో ఉద్యాపనం చెప్పుకోవాలి.
మహిళలు పురుషులనే భేదం లేకుండా ఈ రోజు ఇంటిల్లిపాది కఠోర ఉపవాసాలు ఉండి శివున్ని ధ్యానించడం మంచిది.
DEVOTIONAL