భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి మరణం కచ్చితంగా ఉంటుంది.ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ శాతం మరణాలు నమోదు అవుతున్నాయి.
ఎక్కువగా రోడ్డు ప్రమాదాలలో, మరికొన్ని ఆరోగ్యపరమైన మరణాలు సంభవిస్తున్నాయి.అయితే ఎవరి మరణం ఎప్పుడు వస్తుందో అనే విషయం ఈ ప్రపంచవ్యాప్తంగా ఎవ్వరికీ తెలియదు.
ఎందుకంటే చావు పుట్టుకలనేది మన చేతుల్లో ఉండవు.చావు ఎప్పుడూ ఏ రూపంలో వస్తుందో ఎవ్వరు కచ్చితంగా చెప్పలేరు.
కానీ మనిషి చనిపోయే కొన్ని సంకేతాలు 15 రోజుల ముందే తెలిసిపోతాయట.ఇది మూఢనమ్మకం కాదండోయ్ సైంటిఫిక్ గా కూడా ఆరోజు చేశారు.
ఈ సంకేతాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఏ మనిషి అయినా మరణానికి ముందు ఆహారం నీరు, తాగడం తగ్గిపోతుంది.
ఆ వ్యక్తి ముందు మాట్లాడే దాని కంటే తక్కువగా మాట్లాడుతాడు.ఈ సంకేతాలు కనిపిస్తే భవిష్యత్తులో ఏదో చెడు జరగబోతుందని సంకేతం.
ఈ దశలో ఆ వ్యక్తి అలసటగా ఉంటాడు.అతను ఎక్కువగా మంచం పైనుంచి లేవడానికి ధైర్యం చేయడు.
అతను నిద్ర మేలుకునే విధానం కూడా మారుతుంది.అలాంటి వ్యక్తికి గుండె కొట్టుకోవడం, శ్వాస తీసుకోవడం లో మార్పులు కనిపిస్తాయి.

ఇంటిని వదిలి ఎక్కడికి బయటికి వెళ్ళడు.మరణం మూడు నుంచి నాలుగు రోజుల్లో ఉన్నప్పుడు తన గురించి తానే మరిచిపోయే అవకాశం ఉంది.మనం ఏదైనా విషయం గురించి అడిగినప్పుడు అతడు సరిగ్గా స్పందించలేడు.ఇంకా చాలా విషయాలలో స్పష్టతగా మాట్లాడలేడు.దాదాపు మరణం దగ్గర పడుతున్న కొద్దీ అతని కాళ్లు, చేతులపై చర్మం నీలిరంగు లేదా ఊదా రంగులోకి మారే అవకాశం ఉంది.మూత్ర విసర్జన ప్రేగు కదలికలు ఆగిపోవచ్చు.
అలాగే శరీర ఉష్ణోగ్రత తగ్గడం గమనించవచ్చు.ప్రమాదాలలో చనిపోయే వారికి ఇవేవీ ఉండవు.
అనారోగ్యంతో ఉన్నవారు మాత్రమే ఇలాంటి అనుభవాలను ఎదుర్కొంటారు.
DEVOTIONAL