బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రేఖ తన అంద చందాలతో ఎంతోమంది హృదయాలను దోచేసింది.నటనలో కూడా ఎంతో నైపుణ్యం గల ఈ నటి నేషనల్ ఫిలిం అవార్డు కూడా అందుకుంది.స్ట్రాంగ్, కాంప్లికేటెడ్ క్యారెక్టర్స్ ప్లే చేస్తూ తనకంటూ గొప్ప ఐడెంటిటీ క్రియేట్ చేసుకుందీ ముద్దుగుమ్మ.1958 నుంచి సినిమాల్లో నటిస్తూ అలరిస్తున్న ఈ అందాల తార 1990లో ముఖేష్ అగర్వాల్‌ను పెళ్లి చేసుకుంది.అదే సంవత్సరం అతడు మరణించాడు.అయినా రేఖ ఇప్పటికీ తన నుదుటున సింధూరం పెట్టుకొని కనిపిస్తుంది.
తాజాగా ఈమెకు సంబంధించిన అనేక విషయాలతో “రేఖ ద అన్ టోల్డ్ స్టోరీ” బయోగ్రఫీ బుక్ రిలీజ్ అయింది.యాసర్ ఉస్మాన్ రేఖ దీనిని రాశారు.
ఆ పుస్తకంలో రేఖ అమితాబ్ తోనే కాకుండా మరికొంతమంది హీరోలతో లవ్ అఫైర్ నడిపించినట్లు రాశారు.ఇప్పుడు అదే హాట్ టాపిక్ గా మారింది.
ఆ పుస్తకం ప్రకారం, అమితాబ్ కాక ఆమె లవ్ అఫైర్స్ నడిపిన వారెవరో తెలుసుకుందాం.
• జితేంద్ర
రేఖ తొలిసారిగా బాలీవుడ్ హీరో జితేంద్రతో ప్రేమలో పడిందట.
వీరి కాంబోలో కొన్ని సినిమాలు వచ్చాయి.అయితే జితేంద్ర( Jitendra ) కోస్టార్లతో ఫ్లిర్టింగ్ చేస్తూ రేఖను తన ప్రేమలోకి దింపుకున్నారని అంటారు.
అయితే అప్పటికే అతనికి పెళ్లి అయినా ఇలా చేసేవాడట.
• కిరణ్ కుమార్
బాలీవుడ్ స్టార్ కిరణ్ కుమార్‌తో( Kiran Kumar ) కూడా ఈ అమ్మడు ప్రేమ వ్యవహారం నడిపించిందట.అయితే వీరిద్దరూ ఎక్కువ కాలం కలిసి ఉండలేదు.
• అమితాబ్ బచ్చన్
రేఖ, అమితాబ్ బచ్చన్( Amitabh Bachchan ) ఘాటైన ప్రేమాయణం నడిపినట్టుగా అప్పట్లో రూమర్స్ బలంగా వినిపించాయి.
బిగ్ బి వైఫ్ జయా బచ్చన్ రేఖకు సున్నితంగా వార్నింగ్ ఇచ్చింది అన్నయ్య ఆ తర్వాత వారిద్దరూ కలవలేదని చెబుతారు.
• వినోద్ మెహ్రా
రేఖ, హీరో వినోద్ మెహ్రా( Vinod Mehra ) సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకున్నారని ఇటీవల విడుదలైన పుస్తకం ఆరోపించింది.కాగా వినోద్ ఈ పెళ్లిని ఖండించాడు.
• అక్షయ్ కుమార్
1996లో రేఖ, అక్షయ్ కుమార్( Rekha, Akshay Kumar ) మధ్య ప్రేమ వ్యవహారం నడిచిందట.
• సంజయ్ దత్
1980లో రేఖ, సంజయ్ దత్( Sanjay Dutt ) డైటింగ్ చేశారు.సంజయ్ దత్ కోసమే రేఖ సింధూరాన్ని పెట్టుకోవడం ప్రారంభించిందని చాలామంది అంటారు.అయితే వీరి పెళ్లికూడా చేసుకున్నారని రూమర్స్ వచ్చాయి కానీ వాటిని సంజయ్ దత్ ఖండించాడు.