Fasting : 24 గంటలు ఉపవాసం ఉంటే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

భారతీయులు పండుగలు, వ్రతాల సమయంలో ఉపవాసం( fasting ) చేయడం సహజం.దీంతో భక్తితో పాటు ముక్తి లభిస్తుందని నమ్ముతారు.

 Do You Know How Many Benefits There Are If You Fast For 24 Hours-TeluguStop.com

అయితే ఉపవాసంతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని కొన్ని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి.దీంతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.

అయితే ఇప్పుడు అనేక రకాల ఫాస్టింగ్ ట్రెండ్స్ కూడా బయటికి వచ్చాయి.వాటిలో ఒకటి 24 గంటల ఉపవాసం.

ఒక రోజంతా ఆహారం తినకుండా ఉండడమే దీని అసలు కాన్సెప్ట్.దీనివలన ఎన్నో ఉపయోగాలు ఉంటాయని కూడా తాజాగా కొన్ని పరిశోధనాల్లో తేలింది.

సాధారణంగా కేలరీలు ఎక్కువగా ఉండే ఫుడ్స్ తినడం వలన ఇన్ఫ్లమేషన్ తో పాటు వివిధ ఆరోగ్య సమస్యలు వస్తాయి.

Telugu Hours, Alzheimers, Carbohydrates, Benefitsfast, Glucose, Benefits, Physic

అధిక కేలరీల వినియోగం దీర్ఘకాలిక మెటబాలిక్ ఇన్ఫ్లమేషన్ న్యూరాలజిస్ట్ డాక్టర్స్ సూచించారు.దీని ఫలితంగా అల్జీమర్స్ ( Alzheimer’s )లాంటి వ్యాధుల రిస్క్ పెరుగుతుందని తెలిపారు.కాబట్టి క్యాలరీలను బంద్ చేసేలా ఫాస్టింగ్ ఉంటే అనారోగ్యాల ప్రమాదం తగ్గవచ్చు అని కూడా చెబుతున్నారు.

ఉపవాసం శరీరంపై ప్రభావం చూపిస్తుంది.శరీరం శక్తిని ఉపయోగించే మార్గాలను కూడా ఇది మారుస్తుంది.

శక్తి ప్రాథమిక వనరు గ్లూకోస్ ( Glucose )అని పిలిచే చక్కెర.ఇది సాధారణంగా ధాన్యాలు, పాల ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు, బీన్స్, స్వీట్స్ నుంచి లభిస్తుంది.

Telugu Hours, Alzheimers, Carbohydrates, Benefitsfast, Glucose, Benefits, Physic

ఉపవాస సమయంలో కాలేయం 18 నుండి 24 గంటల వరకు గ్లైకోజన్ నిల్వలను ఉపయోగిస్తుంది.ఈ సమయంలో శరీరం వేరే మోడ్ లోకి మారిపోతుంది.అయితే ఉపవాసం చేస్తున్నప్పుడు శరీరానికి కార్బోహైడ్రేట్లు అందవు.ఫలితంగా శరీరం కొవ్వును ఉపయోగించి గ్లూకోస్ సృష్టించడం ప్రారంభిస్తుంది.ఈ సందర్భంలో జీవక్రియ మందగించి ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతుంది.ఇక శక్తి కోసం శరీరం కండరాల కణజాలాన్ని బంద్ చేయడం ప్రారంభిస్తుంది.

ఆ లెక్కన ఎలాంటి అనారోగ్య సమస్యలు లేనివారు 24 గంటల పాటు ఉపవాసం ఉండడం వలన ఆరోగ్యానికి ఎంతో మంచిది అని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube