ముఖ్యంగా చెప్పాలంటే పితృపక్షాలలో 15 రోజుల పాటు పితృ దేవతలు తమ సంతతిని చూసి వారిని ఆశీర్వదించడానికి భూమి పైకి వస్తారని చాలా మంది ప్రజలు నమ్ముతారు.ఇంకా చెప్పాలంటే మహాలయ అమావాస్య రోజు( Amavasya day ) పితృదేవతలు తమ సంతతి ద్వారం దగ్గరే నిలబడి వారు చేసే కర్మల కోసం ఎదురుచూస్తూ ఉంటారు.
పితృ దేవతలకు ఆ రోజు శ్రార్ధ కర్మ నిర్వహించకపోతే పితృదేవతలు దీవెనలకు బదులుగా శపించి వెళ్తారని చెబుతున్నారు.ప్రతి మాసంలోనీ అమావాస్య పితృదేవతల పుణ్య తిథిగా భావించినప్పటికీ మహాలయ అమావాస్యకు మాత్రం చాలా విశిష్టత ఉంది.
ఈ రోజు సమస్త పితృదేవతల విసర్జనం జరుగుతుంది.

పితృదేవతల పుణ్య తిథి వివరాలు తెలియని వారు, పితృ పక్షంలో ఆ తిథి నాడు కారణవశాన శ్రార్ధం పెట్టలేని వారు మహాలయ అమావాస్య రోజు శ్రార్ధం, దానం, తర్పణం చేయాలి.అలా చేసిన వారికి పితృదేవతల ఆశీస్సులు ఉంటాయి.పితృ అమావాస్య రోజు ఎవరు శ్రార్ధ విముఖంగా ఉండకూడదు.
శ్రార్ధ, కర్మలు చేయడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు.స్కంద పురాణంలో శ్రార్ధం చేయడం వల్ల పితృదేవతల ఆశీర్వాదం వల్ల సంతానం లేని వారికి సంతానం ప్రాప్తిస్తుందని చెబుతున్నారు.
పితృదేవతలను శ్రార్ధ కర్మలతో సంతోషపెడితే వారు తమ సంతతి ఆయుష్షును, విద్యను, ధనాన్ని, సంతానాన్ని కలిగి ఉండేలా ఆశీర్వదిస్తారని చెబుతున్నారు.ఇక శ్రార్ధ కర్మలలో నువ్వులతో మిశ్రిత అన్నం సమర్పిస్తే ధనం అక్షయమవుతుందని పండితులు చెబుతున్నారు.

అన్ని దానాలలో అన్నదానం చాలా ముఖ్యమైనది అని కూడా చెబుతున్నారు.మహాలయ అమావాస్య రోజు ఎవరైతే దానధర్మాలు చేస్తారో, ముఖ్యంగా అన్నదానం చేస్తారో వారికి ఎన్నో యజ్ఞాలను చేసిన పుణ్యఫలం లభిస్తుందని చెబుతున్నారు.అలాగే ముఖా నక్షత్రం పితృదేవతలకు సంబంధించింది.కాబట్టి ఆ రోజు చేసే శ్రార్ధ, కర్మలు అక్షయ ఫలాన్ని ఇస్తాయని చెబుతున్నారు.ఏది ఏమైనా ఎంత బిజీ ఉన్నా పితృ అమావాస్య రోజు పితృదేవతల కోసం కాసేపు సమయాన్ని కేటాయించి శ్రాద్ధం,దానం, తర్పణం తప్పనిసరిగా చేయాలని వివిధ శాస్త్రాలలో ఉంది.