శుక్ర దోషం యొక్క ఏడు సంకేతాలు ఇవే..! పరిహారాలు ఏంటో తెలుసా..?

జ్యోతిష్య శాస్త్రంలో( Jyotishya Shastram ) శుక్రుడిని ( Shukrudu ) ముఖ్యమైన గ్రహంగా పరిగణించబడింది.ఇది ఒక వ్యక్తి యొక్క ఆనందం, అదృష్టం, అందం, సామరస్యం, వివాహం, వ్యాపారాన్ని ప్రభావితం చేస్తుంది.

 These Are The Seven Signs Of Shukra Dosha Details, Shukrudu, Shukra Dosham, Shuk-TeluguStop.com

అలాంటి పరిస్థితులలో జాతకంలో శుక్రుని స్థానం అశుభం అయితే స్థానికులు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.అయితే శుక్రుడి అశుభ ప్రభావం వైవాహిక జీవితంలో సమస్యలు, కుటుంబ జీవితంలో ఆటంకాలు, లైంగిక అవయవాల బలహీనత, ధన నష్టం, ఆరోగ్య సమస్యలు ఉంటాయి.

ఇక వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర దోషం( Shukra Dosham ) యొక్క కొన్ని సంకేతాలు ఇప్పటికీ కూడా ఉన్నాయి.

Telugu Horoscope, Poverty, Raashiphalaalu, Shukra Dosham, Shukradosham, Shukrudu

వాటిని సమయానికి గుర్తించి దోషాన్ని తొలగించుకోవచ్చు.జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే ఒక వ్యక్తి ఆర్థిక సంక్షోభాన్ని( Financial Issues ) ఎదుర్కోవలసి ఉంటుంది.అలాగే పేదరికం కూడా వదలకుండా ఉంటుంది.

అంతేకాకుండా వ్యక్తి యొక్క ఆకర్షణ క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది ఇక ఆ వ్యక్తి ఎప్పుడూ చక్కగా, శుభ్రంగా కనిపించడు.ఎప్పుడు చూసినా మురికిగా ఉండటానికి ఇష్టపడతాడు.

జాతకంలో శుక్ర దోషం ఉన్న కారణంగా స్త్రీకి ఆనందం ఉండదు.అలాగే వైవాహిక జీవితంలో సమస్యలు మిగిలిపోతాయి.

శుక్రుడు స్థానం బలహీనతగా ఉంటే లైంగికత క్రమంగా ముగిస్తుంది.

Telugu Horoscope, Poverty, Raashiphalaalu, Shukra Dosham, Shukradosham, Shukrudu

శుక్రుడి బలహీనత వలన బుగ్గలు, గడ్డం, నరాలపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది.దీంతోపాటు చర్మానికి సంబంధించిన సమస్యలు, కాలేయంలో నొప్పి, చేతులు, కాళ్లలో నొప్పి లాంటివి కనిపిస్తాయి.అలాగే మద్యపానం, జూదం, ధూమపానం లాంటి వాటికి బానిస అవుతారు.

అయితే వీటి నుంచి బయట పడాలంటే పెరుగు, పాలు, జున్ను, ఖీర్, బట్టలు, వెండి, బియ్యం లాంటి తెల్లటి వస్తువులను దానం చేయడం వలన మేలు జరుగుతుంది.అలాగే శుక్రవారం నాడు సర్పంఖ లేదా అరండ్ మూల్ ధరించడం వల్ల శుక్రగ్రహ దుష్ఫలితాలు తగ్గిపోతాయి.

అలాగే శుక్ర దోషం తొలగించడంతో పాటు లక్ష్మీ అనుగ్రహాన్ని పొందడానికి శ్రీ సూక్తం స్తోత్రాన్ని పఠించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube