ఈ శివాలయంలో శివలింగంపై సమర్పించిన నీరు పాలు ఎవ్వరికీ కనిపించవు ఎక్కడంటే.. నాసా కూడా కనిపెట్టలేని మిస్టరీ..

మన దేశవ్యాప్తంగా ఎన్నో పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి.ఆ దేవాలయాలలో ప్రతిరోజు ప్రజలు వెళ్లి పూజలు, అభిషేకాలు, హోమాలు చేస్తూ ఉంటారు.

 No One Can See The Water And Milk Offered On Shiva Lingam In This Shiva Temple I-TeluguStop.com

అంతేకాకుండా ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది.భారతదేశంలో ఉన్న ఎన్నో దేవాలయాలలో చాలా రహస్యాలు దాగి ఉన్నాయి.

మనిషి టెక్నాలజీ లో ఎంతో ముందుకు వెళుతున్న దేవాలయాలలోని కొన్ని రహస్యాలను ఇప్పటికీ కనిపెట్టలేకపోతున్నారు.అలాంటి దేవాలయాలలో ఒకటైన గ్రహ ముక్తేశ్వర్ దేవాలయం కూడా ఒకటి.

ఇంత ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయం ఉత్తరప్రదేశ్ లోని హాపూర్ జిల్లాలో ఉంది.ఈ దేవాలయానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో అడవిలో కళ్యాణ్ ఈశ్వర మహాదేవ దేవాలయం ఉంది.

ఈ దేవాలయం పురాణాలు అద్భుతాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెంది ఉంది.ఈ దేవాలయ శక్తి చత్రపతి శివాజీ జీవితంపై కూడా ప్రభావం చూపింది అని అక్కడి స్థానికులు చెబుతూ ఉంటారు.

శివాజీ ఇక్కడ రుద్ర యాగాన్ని చేసినట్లు చరిత్రలో ఉంది.గంగానది ఒడ్డున ఉన్న ఈ శివలింగం ప్రపంచవ్యాప్తంగా మరో అద్భుతం అని చెప్పవచ్చు.ఈ దేవాలయంలో ప్రతిష్టించిన శివలింగానికి సమర్పించిన నీరు, పాలు ఎవరికీ కనబడకుండా అదృశ్య మవుతున్నాయని చెబుతూ ఉంటారు.ఈ నీరు, పాలు ఎక్కడికి వెళ్తాయో ఇప్పటి వరకు ఎవరికీ కూడా తెలియదు.

ఈ ఆలయ రహస్యం తెలుసుకోవడానికి ఇప్పటివరకు ఎన్నో ప్రయత్నాలు జరిగిన నేటికీ ఆ మిస్టరీ హిస్టరీగానే మిగిలిపోయి ఉంది.

Telugu Bakti, Devotional, Grahamukteshwar, Milk, Nasa, Shiva Lingam, Shiva Templ

కళ్యాణేశ్వర మహదేవ్ దేవాలయం గురించి అనేక పౌరాణిక సంఘటనలు వార్తల్లో ఉన్నాయి.ఒక పురాణం ప్రకారం ఒక నల మహారాజు ఇక్కడ శివలింగానికి జలభిషేకం చేసినప్పుడు అతని కళ్ళ ముందు శివలింగంపై ఎంత నీరు పోసినా అంత నీరు అకస్మాత్తుగా భూమిలో కలిసిపోవడం చూశాడు.అది చూసిన రాజు శివలింగంపై ఎన్నో వేల కొద్దికుండలతో గంగాజలాన్ని పోసిన ఆ నీరు ఎక్కడికి వెళ్తుందో కనిపెట్టలేకపోయాడు.

అలా అభిషేకం చేసి అలసిపోయిన రాజు అది శివుని మహిమ అని అర్థం చేసుకొని క్షమాపణ చెప్పి తన దేశానికి వెళ్లిపోయాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube