నవరాత్రుల్లో చేయాల్సిన, చేయకూడని పనులు ఏవో తెలుసా..?

హిందూమతంలో నవరాత్రి( Navaratri ) పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంది.ఇక నవరాత్రి పండుగ సంవత్సరానికి రెండు సార్లు వస్తుంది.

 Do You Know The Dos And Dont Of Navratri , Navaratri, Durga Puja , Durga Devi-TeluguStop.com

ఇది తొమ్మిది రోజుల పాటు కొనసాగుతుంది.అయితే తొమ్మిది రోజుల్లో దుర్గాదేవిని తొమ్మిది రూపాలతో పూజిస్తూ ఉంటారు.

ఇక శారదీయ నవరాత్రులుగా పిలువబడే ఈ రెండవ నవరాత్రులు ఈ సంవత్సరం అక్టోబర్ 15వ తేదీన ప్రారంభమయ్యాయి.ఈ సమయంలో కొన్ని విషయాలకు దూరంగా ఉండాలని పురాణాలు అలాగే ఇతర శాస్త్రాలు చెబుతున్నాయి.

అయితే నవరాత్రి సమయంలో కచ్చితంగా మాంసాహారానికి దూరంగా ఉండాలి.ఈ తొమ్మిది రోజులపాటు ఎలాంటి మాంసం కూడా తీసుకోరాదు.

నవరాత్రి సమయంలో మాంసం తినకుండా దూరంగా ఉండాలి.నవరాత్రులలో దుర్గాదేవికి( Durga devi ) నైవేద్యాలు సమర్పిస్తారు.


Telugu Annapoorna Devi, Devotional, Durga Devi, Durga Puja, Navaratri-Latest New

అయితే ఆ సమయంలో పొరపాటున కూడా వంటకాలలో ఉల్లి, వెల్లుల్లి అస్సలు వాడకూడదు.అంతేకాకుండా నవరాత్రులలో ప్రజలు తరచుగా స్నానం చేశాక గోళ్లను, జుట్టు( Hair Cutting )ను కత్తిరించుతూ ఉంటారు.కానీ అలా చేయడం అస్సలు మంచిది కాదు.హిందూ మతం ప్రకారం ఉపవాస సమయంలో జుట్టు గానీ గోళ్ళు కానీ కత్తిరించడం వలన అశుభం కలుగుతుంది.కాబట్టి దీనిని నివారించాలని పలువురు సూచిస్తున్నారు.ఇక నవరాత్రుల సమయంలో మద్యపానం, పొగాకు కూడా దూరంగా ఉండాలి.

అంతేకాకుండా కుదిరితే ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు పూర్తిగా మానుకోవాలి.ఇక చాలామంది మామూలు రోజుల్లో ఆహారం వృధా చేస్తూ ఉంటారు.

కానీ ఆహారం వృధా చేయడం పాపం.

Telugu Annapoorna Devi, Devotional, Durga Devi, Durga Puja, Navaratri-Latest New

అన్నపూర్ణ దేవికి( Annapoorna Devi ) ఇది చాలా అవమానకరమైనదిగా పరిగణించబడుతుంది.కాబట్టి నవరాత్రుల సమయంలో కచ్చితంగా ఆహారం వృధా చేయడం నివారించాలి.నవరాత్రుల సమయంలో ఆహారం అస్సలు వృధా కాకుండా చూసుకోవాలి.

అలాగే ఈ సమయంలో సహనంతో మెలగాలి.నవరాత్రుల సమయంలో ప్రార్థన, భక్తికి పవిత్ర కాలం అని అంటారు.

అందుకే ఈ సమయంలో అసహ్యాకరమైన లేదా ప్రతికూల మాటలు అసలు ఉపయోగించకూడదు.అలాగే ఈ సమయంలో స్త్రీలను అగౌరవపరచకూడదు.

ఎందుకంటే నవరాత్రుల తొమ్మిది రోజుల సమయంలో దుర్గాదేవి తొమ్మిది రూపాలను పూజిస్తారు.స్త్రీ శక్తి, ధైర్యాన్ని సూచించే ఈ పండుగ సమయంలో స్త్రీలను అస్సలు అగౌరవపరచకూడదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube