బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇంట తీవ్ర విషాదం.. తల్లి చనిపోవడంతో?

తెలుగు బూతుల ప్రేక్షకులకు బిగ్ బాస్ కంటెస్టెంట్ మెహబూబ్ దిల్ సే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మెహబూబ్ యూట్యూబ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్,అలాగే టిక్ టాక్ లో అదిరిపోయే విధంగా స్టెప్పులు వేస్తూ సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు.

 Bigg Boss Contestant Mehaboob Dil Se Mother Passed Away,mehaboob Dil Se,mehaboob-TeluguStop.com

అలా తనకున్న క్రేజ్ తోనే బిగ్ బాస్ సీజన్ 4 లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మెహబూబ్ కు ఉన్న పాపులారిటీ క్రేజ్ మరింత పెరిగింది.

బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి వచ్చిన తర్వాత కూడా మెహబూబ్ యూటూబ్ లో కొన్ని రకాల వెబ్ సిరీస్ లలో నటిస్తూ అప్పుడప్పుడు బుల్లితెరపై ప్రసారమయ్యే పండుగ ఈవెంట్లో కూడా సందడి చేశాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా మెహబూబ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది.

మెహబూబ్ తల్లి గుండెపోటు కారణంగా మరణించింది.తన తల్లి చనిపోయిన సందర్భంగా తన తల్లి గురించి సోషల్ మీడియాలో ఒక సుధీర్ఘమైన పోస్టును రాసుకొచ్చాడు.

అమ్మా.నువ్వు నన్ను ఒంటరిగా వదిలి వెళ్లిపోయావ్‌.

ఇక మీదట నేను నిర్ణయాలు ఎలా తీసుకోవాలి? ప్రతిరోజూ నేను ఎవరితో మాట్లాడాలి? నువ్వు లేకుండా ఎలా బతకాలి అమ్మీ? నువ్వు లేకుండా ఎలా బతకాలో అర్థం కావడం లేదమ్మా.నేను ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న ఎల్లప్పుడూ నాకు అండగా నిలిచావు.

నా ఎదుగులను చూసి మురిసిపోయావ్‌.మాకోసం సర్వస్వం త్యాగం చేశావవు.

నువ్వు లేకపోతే మా జీవితాలు ఎటు వెళ్తాయో అర్థం కావడం లేదు.ప్రతీక్షణం నిన్ను మిస్‌ అవుతూనే ఉంటాను అమ్మా.

జీవితం అంటే ఏంటో నేర్పించావు.

నువ్వు ఎక్కడున్నా నన్ను చూస్తుంటావని తెలుసు.నిన్ను గర్వపడేలా చేస్తానమ్మా.అలాగే తమ్ముడిని,డాడీని బాగా చూసుకుంటానని మాటిస్తున్నాను.

నా హృదయంలో నీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు.నిన్ను ఎప్పటికీ మిస్‌ అవుతూనే ఉంటాను అంటూ మెహబూబ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌ ను రాసుకొచ్చాడు మెహబూబ్.

ఇది చూసిన పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు స్టే స్ట్రాంగ్‌ మెహబూబ్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.ఇంకొందరు మాత్రం ఇటువంటి పరిస్థితుల్లోనే ధైర్యంగా ఉండాలి అంటూ మెహబూబ్ కి ధైర్యం చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube