వాళ్ళ కేరిర్ పాడవ్వాలనే యాంకర్ రవి గేమ్స్ ఆడుతున్నాడు.. జెస్సి షాకింగ్ కామెంట్స్?

బిగ్ బాస్ కార్యక్రమం నాలుగు వారాలను పూర్తి చేసుకొని 19 మంది కంటెస్టెంట్ లో నలుగురును ఎలిమినేట్ చేసి ప్రస్తుతం 15 మంది కంటెస్టెంట్ లు హౌస్ లో ఉంటూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఈ క్రమంలోనే గతవారం ఎవరూ ఊహించని విధంగా నటరాజ్ మాస్టర్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు.

 Telugu Bigg Boss Season 5 Jaswanth Padala Shocking Allegations On Anchor Ravi Vi-TeluguStop.com

ఇక సోమవారం యధావిధిగా హౌస్ లో నామినేషన్ ప్రక్రియ జరిగి హౌస్ వాతావరణం మొత్తం వేడెక్కుతుందన్న విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే సోమవారం నామినేషన్ ప్రక్రియ కూడా జరిగిపోయింది.

ఇక సోమవారం ఎపిసోడ్ లో భాగంగా సిరి షణ్ముఖ్ జస్వంత్ ముగ్గురు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు.ఈ క్రమంలోనే కంటెస్టెంట్ ప్రియపై అరిచే విధంగా చేసింది రవి నేనని కూడా తాను చెప్పినట్టు వింటే లోబో ముందుకెళ్తావంటూ చెప్పింది రవి అంటూ ఈ సందర్భంగా జెస్సీ తెలియజేశారు.

నా దగ్గర ఏ విధమైనటువంటి ప్లాన్ లేదు కానీ రవి మాత్రం పక్కా ప్లాన్ తో గేమ్ ఆడుతున్నాడు.లోబోని ఉపయోగించి నటరాజ్ మాత్రం బయటికి పంపించాడు.

నటరాజ్ మాస్టర్ కూడా లోబోతో స్నేహం చేసి బావ బావ అంటూనే చివరికి బావను బయటకు పంపారు అంటూ ఈ ముగ్గురు కలిసి మాట్లాడుకుంటున్నారు.

Telugu Anchor Ravi, Jaswanth Padala, Jessy, Lobo, Natraj Master, Telugubigg-Movi

ఆ తర్వాత జెస్సీ రవి గురించి ఎంతో దారుణంగా మాట్లాడాడు.గేమ్ ఆడాలంటే గెలవాలి అనుకోవడం తప్పు లేదు కానీ ఇలా ఒకరిని తొక్కి గెలవాలి అనుకుంటే అంతకన్నా లేకి గాళ్ళు ఎవరూ ఉండరని.ఇలాంటి వాడు గేమ్ లోనే ఇలా ఆలోచిస్తున్నాడు అంటే కెరియర్ లో ఎంత మందిని తొక్కి ఉంటాడో అంటూ రవి గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు.

మొదట్లో నన్ను ఎవరు రాంగ్ గైడెన్స్ చేస్తున్నారని గేమ్ అలా ఆడాలి, ఇలా ఆడాలి అంటూ తనకు సజెస్ట్ చేశారని.గేమ్ ఎలా ఆడాలో నాకు తెలుసు అంటూ నేను చెప్పడంతో అప్పటి నుంచి నన్ను టార్గెట్ చేస్తున్నాడు అంటూ ఈ సందర్భంగా రవి పక్కా ప్లాన్ తోనే గేమ్ ఆడుతున్నారని జశ్వంత్ తెలియజేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube