గత కొన్నిరోజులుగా హేమచంద్ర శ్రావణ భార్గవి విడాకులు తీసుకోనున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ ప్రచారంలోకి వస్తున్నాయి.చైతన్య సమంత విడిపోయిన తర్వాత సెలబ్రిటీలకు సంబంధించిన విడాకుల వార్తలు మరింత ఎక్కువగా ప్రచారంలోకి వస్తున్నాయి.
అయితే కొంతమంది సెలబ్రిటీలు ఈ వార్తల గురించి స్పందించి క్లారిటీ ఇస్తుంటే మరి కొందరు సెలబ్రిటీలు మాత్రం ఈ వార్తల గురించి స్పందించడం లేదు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్స్ గా పాపులర్ అయిన హేమచంద్ర శ్రావణ భార్గవి విడాకులు తీసుకోనున్నారని 2013 సంవత్సరంలో పెళ్లి బంధంతో ఒక్కటైన ఈ జోడీ త్వరలోనే అధికారికంగా విడాకులు తీసుకునే ఛాన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
హేమచంద్ర, శ్రావణభార్గవిలకు ఒక కూతురు ఉండగా కూతురు పేరు శిశిరచంద్రిక.అటు హేమచంద్రకు ఇటు శ్రావణభార్గవిలకు సమానంగా పాపులారిటీ ఉంది.
అయితే హేమచంద్ర శ్రావణభార్గవి వైరల్ అవుతున్న వార్తల గురించి స్పందించకపోవడంతో ఈ వార్తలు నిజమేనని చాలామంది ఫిక్స్ అయ్యారు.
హేమచంద్ర శ్రావణభార్గవిలకు వైరల్ అవుతున్న వార్తల గురించి స్పందించాలని కొంతమంది ఫ్యాన్స్ మెసేజ్ లు చేస్తున్నా ఆ మెసేజ్ లకు వాళ్లు రియాక్ట్ కావడం లేదు.హేమచంద్ర శ్రావణ భార్గవి విడిపోతే మాత్రం వీళ్లిద్దరి ఫ్యాన్స్ బాధపడే ఛాన్స్ అయితే ఉంది.
కొన్ని రోజుల క్రితం కూడా వీళ్లిద్దరూ కలిసి ఒక ఓటీటీ షోలో సంతోషంగా కనిపించారు.అయితే రోజుల వ్యవధిలోనే వీళ్లిద్దరూ విడాకులు తీసుకునే పరిస్థితి రావడం గమనార్హం.అయితే ఈ వార్తలు నిజం కాకపోవచ్చని కొందరు నెటిజన్లు భావిస్తున్నారు.
త్వరలో వైరల్ అవుతున్న వార్తలకు సంబంధించి హేమచంద్ర లేదా శ్రావణ భార్గవి నుంచి క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.హేమచంద్ర, శ్రావణ భార్గవి ప్రస్తుతం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న టాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారు.