ప్రముఖ కోలీవుడ్ నటుడు కమల్ హాసన్ వారసురాలుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన శృతిహాసన్ టాలీవుడ్ లో హీరోయిన్గా మంచి గుర్తింపు.
అనగనగా ఒక ధీరుడు సినిమా ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి హీరోయిన్ గా టాలీవుడ్ లో తనకంటూ మంచి గుర్తింపు ఏర్పరచుకుంది.ఆ తర్వాత కొంతకాలం సినిమాలకు దూరమైన శృతిహాసన్ రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమా ద్వారా మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది.
ఇక ఇటీవల చిరంజీవి బాలకృష్ణ వంటి సీనియర్ హీరోల సరసన నటించి ఒకేసారి రెండు సినిమాలతో హిట్ అందుకుంది.సంక్రాంతి కానుకగా విడుదలైన వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలలో నటించి మంచి హిట్స్ అందుకుంది.ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటున్న శృతిహాసన్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది.తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
తాజాగా గతంలో తన జీవితంలో జరిగిన చేదు అనుభవాల గురించి తలుచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.
ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.2012 లో తనకు ఎదురైన చేదు అనుభవాలు తలచుకుంటూ ఒక ఫోటో షేర్ చేస్తూ ” ఈ ఫోటో 2012 నాటిది.ఆ ఏడాది వ్యక్తిగతంగా నాకు మంచి జరగలేదు.
వృత్తి పరంగా కూడా చాలా మార్పులు జరిగాయి.అప్పుడు నా జీవితం నకిలీ వైపు బలమైన గాలి వీచింది.
అప్పుడు నాలో మండే మంటలో ఒక బాధ ఉంది.నా భవిష్యత్తు కోసం ఎప్పుడూ ఏదో ఒకటి వెతుకుతూ,ఇక ఏదో నేర్చుకోవాలని కలలు కనేదాన్ని.
జీవితం నిశబ్దం అనేది చాలా హింసాత్మకంగా ఉంటుంది” అంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.