అత్తతో గొడవ.. భర్తతో గొడవ.. వైరల్ అవుతున్న పూరీ జగన్నాథ్ సంచలన పోస్ట్!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్( Director Puri Jagannath ) గత కొద్దిరోజులుగా పూరీ మ్యూజింగ్స్ పేరుతో పాడ్ కాస్ట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే చాలా అంశాల గురించి చెబుతూ స్ఫూర్తిని నింపిన ఆయన తాజాగా సోషల్ మీడియాలో మరో అంశం గురించి స్పందించారు.

 Puri Musings On Social Media And New Resolution, Puri Musings, Social Media, Use-TeluguStop.com

ఈమెకు తాజాగా సోషల్ మీడియా అనే అంశంపై స్పందిస్తూ.సోషల్ మీడియా అనేది చాలా పవర్‌ఫుల్‌ టూల్‌.

అది జనాల్లోకి వచ్చిన దశలో కమ్యూనికేషన్‌ పెరిగిందనుకున్నాము.కానీ రానురానూ అది మన జీవితాల్లో దెయ్యంలా మారింది.

దాని వల్ల ఇతరులతో పోల్చుకోవడం ఎక్కువ అయ్యింది.ప్రతి దాన్ని ఫొటో తీసి చూపించడం ఎక్కువైంది.

భర్తతో కాపురం చేయడం కంటే తమ భాగస్వామితో అన్యోన్యంగా ఉన్నట్టు ఫొటోలు పోస్టు చేయడంతో చాలా మందికి ఆసక్తి పెరిగింది.

కొత్త దుస్తులు ధరిస్తే ఒక ఫొటో తీయాలి.

బెడ్‌ రూమ్‌లో ఒక ఫొటో, తింటునప్పుడు ఒక ఫొటో.ఇలా డిజిటల్‌ అడిక్షన్‌ ( Digital addiction )పెరిగిపోయింది.

దీనికి తోడు ట్రోలర్స్‌.మన చుట్టూ జాబ్‌లేని వారు ఎంతోమంది ఉన్నారు.

మీరు చూపించే ఫోటోలు వారికి నచ్చవు.అసూయ పడతారు.

బికినీ వేసుకుని మాల్దీవుల్లో దిగిన ఫొటో మీరు పంచుకుంటే, అది చూసిన ట్రోలర్స్‌ కామెంట్స్‌ చేస్తారు.ఇంకొందరు ప్రశ్నిస్తారు.

మరి కొందరు అసభ్యకరంగా మాట్లాడతారు.వాటన్నింటినీ చదువుతూ పనులు మానేసి మీరు ఏడుస్తూ పడుకుంటారు.

ఎందుకంటే మీరు కూడా జాబ్‌లేని వారే! దాని వల్ల రోజూ మీరు కుంగిపోతూ బతుకుతారు.ఈ సోషల్‌ మీడియా పోస్టుల వల్ల ఎంతోమంది దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

బంధాలు దెబ్బతింటున్నాయి.

Telugu Puri, Tollywood-Movie

10 విడాకుల్లో 3 సోషల్‌ మీడియా కారణంగా అవుతున్నాయని తాజాగా నిర్వహించిన ఒక సర్వే తెలిపింది.మీ ఇంట్లో జరిగే గొడవలకు సోషల్‌ మీడియానే కారణం.మీరు రిలేషన్‌షిప్‌లో ఉన్నా పెళ్లైనా దయచేసి దానికి దూరంగా ఉండడం మంచిది.

మీ భర్తే ప్రపంచం అనుకున్నప్పుడు మిగిలిన ప్రపంచం మీకెందుకు? మీ కుటుంబం బాగుండాలని కోరుకుంటే అవన్నీ ఎందుకు? ప్రతి క్షణం మీ జీవితంలో ఏం జరుగుతుందోనని లైవ్‌ టెలికాస్ట్‌ ఆపేయండి.మీరు ఆనందంగా ఉన్నా పోస్టు పెట్టొద్దు.

బాధలో ఉన్నా పోస్టు పెట్టొద్దు.ముఖ్యంగా అమ్మాయిలు.

వాళ్ల ఇన్‌స్ట్టాగ్రామ్‌ చెక్‌ చేస్తే వాళ్లింట్లో ఏం జరుగుతుందో చెప్పేయవచ్చు.ఎవరితో ఏం గొడవ అవుతుందో ఊహించవచ్చు.

Telugu Puri, Tollywood-Movie

అత్తతో గొడవ అయితే ఒక పోస్టు, భర్తతో గొడవ అయితే మరో పోస్టు.అది చూసి వెంటనే మరో మహిళ ఫోన్‌ చేస్తుంది.ఎందుకో తెలియదు అక్కా.నువ్వు కలలోకి వచ్చావ్‌.ఇంట్లో అంతా ఓకేగా అని మాట్లాడడం ప్రారంభిస్తుంది.మనం ఏడుస్తూ అన్నీ చెప్పేస్తాం.

ఎందుకంటే మనకు బుద్థి లేదు.కుటుంబ విషయాలు చెప్పకూడదనే ఇంగిత జ్ఞానం కూడా లేదు.

ఒకటి గుర్తుపెట్టుకోండి.మీరు ఏ పోస్టు పెట్టినా నెగెటివిటీని ఆకర్షిస్తున్నట్టే.

మీ కుక్క ఫొటో పెడితే.తర్వాత అది హాస్పిటల్‌లో చేరుతుంది.

మీ భర్త ఫొటో పెడితే ఆయన అనారోగ్యంతో కిందపడిపోతాడు.డైనింగ్‌ టేబుల్‌ వద్ద దిగిన గ్రూప్‌ ఫొటో పెడితే ఫుడ్‌ పాయిజన్‌ అయి ఎవరో ఒకరు చనిపోతారు.

ఇతరుల ఏడుపు తగిలి మిమ్మల్ని దరిద్రం చుట్టుకుంటుంది.అందుకే నెగెటివిటీని అట్రాక్ట్‌ చేయొద్దు అని చెప్పుకొచ్చారు పూరి జగన్నాథ్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube