ఏపీలో తెలుగుదేశం(TDP) పార్టీకి తిరుగలేదు అన్నట్లుగా పరిస్థితి ఉంది.ప్రస్తుతం టిడిపి, జనసేన, బిజెపి కూటమి(TDP, Janasena, BJP alliance) ప్రభుత్వం ఉంది.
ఒంటరిగానైనా టిడిపి బలంగానే ఉంది .ఈ ఐదేళ్లపాటు ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమి లేదు.వచ్చే ఎన్నికల్లోను తమకు తిరుగులేకుండా ముందుగానే పక్క ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు టిడిపి అధినేత చంద్రబాబు(Chandrababu). వైసీపీని మళ్లీ అధికారంలోకి రాకుండా చేసేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు.
అందుకే రాబోయే ఎన్నికల్లో టిడిపి , జనసేన, బిజెపి కూటమి గానే ఉంటాయని , కలిసి ఎన్నికలకు వెళ్తాయని బాబు సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతున్నారు ఇక ఏపీ సంగతి పక్కన పెడితే, తెలంగాణ పై ఇప్పుడు చంద్రబాబు పూర్తిస్థాయిలో ఫోకస్ చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ (Congress, Telangana)అధికారంలో ఉంది .బిఆర్ఎస్, బిజెపి ప్రభావం అంతంత మాత్రమే అన్నట్టుగా ఉండడంతో ,టిడిపి తెలంగాణలో బలోపేతం అయ్యేందుకు ఇదే సరైన సమయంగా బాబు భావిస్తున్నారు.అందుకే అక్కడ టిడిపిని బలోపేతం చేసే విషయంపై దృష్టి సారించారు.
ఇప్పటికే తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై సర్వే కూడా చేయించినట్లు సమాచారం .ప్రశాంత్ కిషోర్(Prashant Kishore) టీం సర్వే చేసిన కొన్ని నివేదికలు చంద్రబాబుకు అందాయట తెలంగాణలో టిడిపికి(TDP, Telangana) ఓటు బ్యాంకు ఉన్నా, నాయకత్వం లోపం కారణంగా పార్టీ అక్కడ పుంజుకోలేకపోతోంది.దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులను పోటీకి దించే ఆలోచనతో చంద్రబాబు ఉన్నారట. విజయావకాశాల పైనా సర్వే చేయిస్తే నాయకత్వలేమే పార్టీకి మైనస్ అని ప్రశాంత్ కిషోర్ టీం సర్వే తేల్చిందట .స్థానిక సంస్థలు ఎన్నికల్లో పోటీ చేసి కనీసం కొన్ని స్థానాల్లో అయినా గెలిచినా, గెలవకపోయినా ఒక నాయకత్వం ఏర్పడుతుందని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారట.ఎలాగూ ఏపీలో టిడిపి అధికారంలో ఉండడంతో నిధులకు ఇబ్బంది ఉండదని , ఎన్ని నిధులైన వెచ్చించి తెలంగాణలో టిడిపిని బలోపేతం చేయాలనే పట్టుదలతో చంద్రబాబు ఉన్నారట.
వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులను పోటీకి దించాలంటే ముందుగా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లి పార్టీ క్యాడర్ లో జోష్ నింపగలిగితే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీ ఆటోమేటిక్ గా పుంజుకుంటుంది అని చంద్రబాబు భావిస్తున్నారట.అయితే చంద్రబాబు అనుకున్నట్లుగా ఇక్కడ టిడిపిని బలోపేతం చేయడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు .
కొన్ని ప్రాంతాల్లో తప్ప మిగిలిన చోట్ల ఇబ్బందులే ఎక్కువగా ఉన్నాయి.ఏపీకి చెందిన నాయకత్వం ఉన్న పార్టీలకు అక్కడ అవకాశం లేదనే విషయం ఇప్పుడు అందరికీ అర్థం అయ్యింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నిధులు, నీళ్లు నియామకాల పైన.మళ్లీ వీరి చేతుల్లోకే అధికారం వెళితే తమకు మళ్ళీ అన్యాయం జరుగుతుందని తెలంగాణ ప్రజలు భావించే అవకాశం లేకపోలేదు.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టిడిపికి కాస్త పట్టు ఉన్నా , ఇప్పుడున్న పరిస్థితుల్లో గెలిచే అంత స్థాయిలో ఆ పార్టీకి బలం లేదని విషయం అందరికీ తెలుసు.హైదరాబాద్ నగరంలో టిడిపిని అభిమానించేవారు, సెటిలర్లు ఉన్నా, వారు ఎంతవరకు టిడిపి వైపు చూస్తాననేది అనుమానమే.
ఇప్పటికే చాలామంది బీఆర్ఎస్ , బీజేపీ , కాంగ్రెస్ పార్టీలకు అనుకూలంగా మారిపోయారు.ఈ నేపద్యంలో చంద్రబాబు తెలంగాణలో పార్టీ బలోపేతం చేసి, వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలనుకోవడం అత్యాశ గానే ఉందనే అభిప్రాయాలు సర్వత్ర వ్యక్తం అవతున్నాయి.