అమ్మకానికి మలేషియా ఎయిర్ లైన్స్! ఆర్ధిక సంక్షోభమే కారణం!

విమానయానంలో డెబ్భై ఏళ్ల సుదీర్ఘ ప్రస్తానం కలిగి వుండి, ప్రపంచంలో అత్యంత గుర్తింపు పొందిన ఎయిర్ లైన్స్ గా, దశాబ్దాల చరిత్ర కలిగి వున్న మలేషియా ఎయిర్ లైన్స్ అమ్మకానికి వచ్చింది.గత కొన్ని సంవత్సరాలుగా తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయి, మరో వైపు ఎయిర్ లైన్స్ సిబ్బంది నిర్లక్ష్యంతో ప్రయాణికుల నుంచి బ్యాడ్ ఎయిర్ లైన్స్ సర్వీస్ గా మలేషియా ఎయిర్ లైన్స్ ముద్ర వేసుకుంది.ఈ నేపధ్యంలో విమానయాన సంస్థని పూర్తిగా మూసేయాలా, లేకా అమ్మేయాలా అనే ఆలోచనతో ఇప్పుడు సంస్థ అధినేతలు వున్నారు.

 Malaysia Airlines Could Be Sold Or Shut Down-TeluguStop.com

2014లో మలేషియా ఎయిర్ లైన్స్ కి చెందిన ఎంహెచ్370 కనిపించకుండా పోవడం, అలాగే 33 వేల ఎత్తులో ఎంహెచ్17 విమానాన్ని క్షిపణి డీకొనడం వంటి ప్రమాదాల కారణంగా ఈ విమానాలలో ప్రయాణించేందుకు ప్రయాణికులు భయపడుతున్నారు.దీంతో విమానయాన సర్వీసులని ఎయిర్ లైన్స్ పూర్తిగా తగ్గించుకోవాల్సి వచ్చింది.ఈ నేపధ్యంలో సంస్థ ఒక్కసారిగా భారీగా నష్టాలతో ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయింది.దీంతో తప్పని పరిస్థితిలో సంస్థ అధిపతులు మలేషియా ఎయిర్ లైన్స్ సేవలకి ముగింపు పలకాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube