అమెరికాలో భారతీయులు టెకీలుగా, శాస్త్రవేత్తలు గా మాత్రమే కాకుండా టెలివిజన్ రంగంలో కూడా రికార్డులు సృష్టిస్తున్నారు.ఇప్పటి వరకూ ఒక్క ప్రవాస మహిళ కూడా టీవీ షో లలో కనిపించిన దాఖలాలు లేవు.అయితే అమెరికాలో ప్రఖ్యాతిగాంచిన కామెడీ టీవీ షో కొనాన్ టీవీ షో లో మొట్టమొదటి సారిగా భారతీయసంతతికి చెందిన మహిళ ఇచ్చారు అయితే
ఇప్పుడు ఆ మహిళ చేసిన షో కి విపరీతమైన ఆదరణ పెరిగిపోతోంది.ఇక ఆమె వివరాలలోకి వెళ్తే.అమెరికాలోనే నివాసం ఉంటున్న అపర్ణ నాంచెర్ల హస్య రచనలు చేయడమేకాక, పలు ప్రదర్శనలు ఇస్తుంటారు.అయితే అమెరికా టీవీల్లో అర్ధరాత్రి ప్రసారం చేసే కామెడీ ప్రోగ్రాం కొనాట్ టీవీ షోలో అర్చన తన తొలి కామెడీ ఆల్బమ్ అయిన “జస్ట్ పుట్టింగ్ ఇట్ అవుట్ దేర్” కు సంబంధించిన ప్రదర్శన ఇచ్చారు.
ఈ షోకి విపరీతమైన ఆదరణ రావడంతో పాటు ఆమె కూడా అక్కడ పాప్లర్ అయిపోయారు.దాంతో ఆమె పేరు అమెరికా వ్యాప్తంగా మారు మొగిపోతోంది.అయితే గతంలో వేరొక వ్యక్తితో కలిసి షో ఇచ్చిన ఆమె సింగల్ గా ప్రదర్సన ఇవ్వడం మాత్రం ఇదే ప్రధమం.