హైదరాబాద్ తెలంగాణభవన్ లో ఇవాళ నిర్వహించిన బీఆర్ఎస్ ప్రతినిధుల సభలో పలు తీర్మానాలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రవేశపెట్టారు.దేశంలో రైతు రాజ్యం స్థాపించాలని తీర్మానించారు.
ప్రతి రాష్ట్రంలో కనీసం ఒక భారీ నీటి ప్రాజెక్టు నిర్మించాలని కేటీఆర్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.దేశ వ్యాప్తంగా 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరాకు కొత్త పాలసీ అమలు చేయాలని తీర్మానించారు.
మన దేశ బ్రాండ్ తో విదేశాలకు ఫుడ్ ప్రాజెక్టులను ఎగుమతి చేయాలని, అదేవిధంగా దేశ వ్యాప్తంగా దళిత బంధును అమలు చేయాలని తీర్మానించారు.దాంతో పాటు భారీ స్థాయిలో మౌలిక వసతులు కల్పించాలని, బీసీ జనగణన జరపాలన్నారు.
దేశంలో ద్వేషాన్ని విడిచి, ప్రశాంతంగా ఉండేందుకు దేశ పౌరులంతా ఏకం కావాలని తీర్మానం చేశారు.