ఆ అలవాటు వలన కూడా కిడ్నీలు ప్రమాదంలో

నిద్రలేమి ఎన్నో అనర్థాలకు కారణం అవుతుంది.చాలా పెద్దగా ఉండే ప్రమాదాల లిస్టులోకి క్రోనిక్ కిడ్నీ డిసీజ్ (CKD) కూడా వచ్చి చేరింది.చికాగో లోని యునివర్సిటి ఆఫ్ ఇల్లినాయిస్ పరిశోధకులు చేసిన స్టడీలో ఈ విషయాన్ని వెల్లడించారు.432 యువతి యువకలపై కొంతకాలం పరిశోధన జరిపిన ప్రొఫెసర్స్, CKD తో ఇబ్బందిపడుతున్న వారి చేతికి ఓ ఎలక్ట్రానిక్ బ్యాండ్ తగిలించారు.ఆ బ్యాండ్ ద్వారా రోజుకి ఎవరు ఎంతసేపు నిద్రపోతున్నారో ట్రాక్ చేసేవారు.

 Sleeplessness Can Lead To Chronic Kidney Disease , Sleeplessness  , Kidney Disea-TeluguStop.com

అందులో తక్కువగా నిద్రపోయినవారు, అంటే 7 గంటలకి తక్కువ నిద్రతో రోజులు గడిపినవారిలో 70 మందిలో కిడ్నీకి సంబంధిచిన సమస్యలు పెరిగిపోగా, మరో 48 మంది ఏకంగా మృత్యువాత పడ్డారట.

నిద్ర ఓ గంట పెరిగినా కొద్ది, CKD వచ్చే అవకాశం 19% తగ్గిపోతుందని ప్రొఫెసర్ అనా రికార్డో తెలిపారు.

ఆ ప్రొఫెసర్ ఇంకా మాట్లాడుతూ ” మన నిద్రకి కిడ్నీ పనితనానికి చాలా సంబంధం ఉంటుంది.

మా రిసేర్చిలో ఇదే విషయం బయటపడింది.ఆయుష్షు క్షీణించే అతిపెద్ద కారణాలలో నిద్రలేమీ ప్రధానమైనది.

క్రోనిక్ కిడ్నీ డిసీజ్ రావడానికి ఇదో పెద్ద కారణం.కాబట్టి ఆరోగ్యకరమైన నిద్ర శరీరానికి ఇవ్వాలి.” అంటూ చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube