ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి లడ్డు ( Tirupathi Laddu ) వ్యవహారం రోజురోజుకు ముదురుతుంది.అయితే లడ్డు విషయంలో పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) సనాతన ధర్మం గురించి గట్టిగా తన గళం వినిపిస్తున్నారు.
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ వ్యవహార శైలిపై ఎన్నో విమర్శలు వస్తూ ఉండగా మరికొందరు మాత్రం ఈయన తీసుకునే నిర్ణయం పై ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు.ఇక పవన్ కళ్యాణ్ కు మద్దతుగా సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు కూడా సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తూ ఉన్నారు.
ఈ క్రమంలోనే దర్శకుడిగా మంచి సక్సెస్ అందుకున్న కృష్ణవంశీ ( Krishna Vamsi ) సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు.ఈ క్రమంలోనే ఒక నెటిజన్ తిరుపతి లడ్డు ఇష్యూ గురించి మీ అభిప్రాయం ఏంటి అంటూ ప్రశ్న వేశారు.ఈ ప్రశ్నకు కృష్ణవంశీ సమాధానం చెబుతూ.మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద నాకు బోలెడంత గౌరవం, ప్రేమ ఉన్నాయి.అవినీతిపరమైన, కలుషితమైన రాజకీయ నాయకుల మధ్యలో ఒకరు విలువల కోసం నిలబడుతున్నారు.దేవుడు ఆయనతో ఎప్పుడూ ఉండాలని కోరుకున్నారు.
దీంతో మరొక నెటిజన్ పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.దానికి కృష్ణవంశీ స్పందిస్తూ థాంక్యూ సో మచ్ అండీ నిజం ఎప్పటికీ నిజమే.పవన్ కళ్యాణ్ రియల్ హీరో.ఆయన మళ్ళీ మళ్ళీ అది ప్రూవ్ చేస్తూనే ఉంటారు.ఇలాంటి నాయకులు మనకు చాలా మంది కావాలి.యోగి ఆదిత్యనాథ్ ( Yogi Adityanath ) తర్వాత పవన్ కళ్యాణ్ స్పెషల్ పొలిటీషియన్ అంటూ పవన్ కళ్యాణ్ గురించి ఈయన పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తూ చేసిన ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.