తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ దే అధికారంలోకి వస్తుందని తెలుస్తోంది.ఈ మేరకు స్థానిక సర్వే సంస్థలు అదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి.
మరోవైపు కొన్ని సర్వే సంస్థలు పోటాపోటీ ఎన్నికలని భావిస్తున్నాయి.ఈ సర్వేలన్నీ బీఆర్ఎస్ కు దాదాపు 60 నుంచి 68 వరకు సీట్లు వస్తాయని చెబుతున్నాయి.
అలాగే రెండో స్థానంలో కాంగ్రెస్ కు 34 నుంచి 40 సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.బీజేపీకి కొంత ప్రాబల్యం తగ్గడంతో కొంచెం వెనుకబడిందని సర్వే సంస్థలు చెబుతున్నాయి.
మరోవైపు ఆరా అనే సంస్థ నిర్వహించిన సర్వేలో మాత్రం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని వెల్లడైంది.కాంగ్రెస్ 58 నుంచి 67 సీట్లు సాధించే అవకాశం ఉందని చెబుతోంది.అటు బీఆర్ఎస్ 39.58 శాతం మాత్రమే ఓట్లు వచ్చే అవకాశం ఉండగా, బీజేపీకి 5 నుంచి 7 సీట్లు రావచ్చని సర్వే పేర్కొంది.