తెలుగు హీరోయిన్ రోజా పరిచయం ఇక్కడ అవసరం లేదు.దాదాపు ఓ దశాబ్దకాలంకి పైగా హీరోయిన్ గా నటించి తెలుగు సినిమా ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకుంది.
ఆ తర్వాత రాజకీయ నాయకురాలిగా, జబర్దస్త్ జడ్జిగా, ప్రస్తుతం మంత్రిగా తనదైన ప్రత్యేకతతో వ్యవహరిస్తూ.ముందుకు దూసుకుపోతోంది రోజా.
ఇన్ని పాత్రల ఫలితంగా యావత్ తెలుగు ప్రేక్షకులకు ఆమె సుపరిచితురాలు అయిపోయింది.ఆమె హీరోయిన్ గా నుండి ప్రస్తుతం మంత్రిగా సాగే వరకు ఆమె జీవితం గురించి చెప్పకుంటూ పొతే సమయం సరిపోదు.
తాజా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది రోజా.ప్రస్తుతం సాఫీగా సాగుతున్న ఆమె జీవితం వెనక ఎన్నో కష్టాలు, కన్నీళ్లు ఉన్నాయనేది నిర్వివాదాంశం.అయితే అన్నిటి వెనక తన కుటుంబం సపోర్ట్ ఉండటంతో ఆమె ప్రస్తుతం సక్సెస్‌ఫుల్ గా కొనసాగుతోంది అనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు.ఆమె జీవితంలో జరిగిన ఓ సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రోజా తండ్రి కార్పొరేషన్ లో పనిచేస్తున్న రోజులవి.కూతురు సినిమాలలో నటిస్తానంటే పాపం ఆయన కాదనలేకపోయాను.
దాంతో అమ్మడు సినిమా ఛాన్సులు కోసం ట్రై చేసేదట.
ఆ రోజుల్లో రోజా అంత అందంగా ఏమీ ఉండేది కాదట.చాలా పేలవంగా చామన చాయతో ఎప్పుడూ అల్లరి చేస్తూ ఉండేదట.దాంతో ఏ ఆఫీసుకి వెళ్లినా హీరోయిన్ గా పనికిరాదని వెనక్కి పంపించేసేవారట.
కట్ చేస్తే అలనాటి హీరోయిన్ నటి కృష్ణవేణికి ఒక రోజు షూటింగ్ ఉందని హడావిడిగా సెట్ కు వెళ్లిందట.అక్కడ రోజా తండ్రి నాగరాజు రెడ్డి గారు కలిశారట.
దాంతో కృష్ణవేణి నటిస్తున్న సినిమాలో రోజానే హీరోయిన్ అని తెలుసుకొని ఆశ్చర్యపోయిందట.అసలు ఈమె హీరోయిన్ ఎలా అయిందా అని నటి కృష్ణవేణికి కూడా సందేహం వచ్చిందట.