దర్శకుడు కేఎస్ రవికుమార్( Director KS Ravikumar ) ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఆ ఇంటర్వ్యూలో బాగా రవికుమార్ మాట్లాడుతూ లింగ సినిమా( Lingaa Movie ) ఫ్లాప్ అవడం గురించి స్పందించారు.
ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ.ఎడిటింగ్ విషయంలో రజనీకాంత్ జోక్యం చేసుకున్నారు.
సీజేఐకు నాకు ఏ మాత్రం సమయం ఇవ్వలేదు.సెకండాఫ్ మొత్తాన్ని ఆయన మార్చేశారు.
అనుష్కతో ఉండే ఒక పాట, క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ను తొలగించేశారు.కృతిమంగా ఉండే బెలూన్ జంపింగ్ సీన్ యాడ్ చేశారు.

లింగ సినిమాను గందరగోళం చేశారు అని రవికుమార్ వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఆయన ఈ విషయంలో జోక్యం చేసుకోవడం వల్లే ఈ సినిమా ఫ్లాప్ అయింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రవికుమార్.ఈ మేరకు ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇకపోతే రవికుమార్ విషయానికి వస్తే.కోలీవుడ్ లో ఎన్నో మంచి మంచి సినిమాలను తెరకెక్కించి దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు.

ఆయన దర్శకత్వం వహించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచాయి.ఇకపోతే రజినీకాంత్ తో( Rajinikanth ) ఆయన గతంలో ముత్తు నరసింహ వంటి సినిమాలను తలకించి మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.కానీ వీరిద్దరి కాంబినేషన్ లో 2014లో భారీ బడ్జెట్‌లో యాక్షన్ కామెడీ ఫిల్మ్‌గా ఇది తెరకెక్కింది.రజనీకాంత్ ద్విపాత్రాభినయంలో కనిపించారు.సోనాక్షి సిన్హా, అనుష్క హీరోయిన్ లుగా నటించారు.ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.మంచి వసూళ్లు రాబట్టినప్పటికీ పరాజయం అందుకుంది.