చనిపోయిన భార్యను బ్రతికించిన ఒడిశా వ్యక్తి.. ఎలాగంటే?

‘నిజమైన ప్రేమ ఎప్పటికీ అంతం కాదు’ అని అంటారు.నిజంగా ప్రేమించే వారు తమ ప్రియురాలను, ప్రియుడిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు.

 Man Brings Dead Wife Alive Through Silicone Statue, Silicone Statue, Wife Memori-TeluguStop.com

వారు బతికి ఉన్నారా లేదా అనేది పట్టించుకోకుండా వారి కోసం ప్రతిదీ చేస్తారు.ఒడిషా రాష్ట్రంలోని బెర్హాంపూర్ నగరంలో ఇలాంటి ఓ ట్రూ లవర్ వెలుగులోకి వచ్చారు.

ప్రశాంత్ కుమార్ నాయక్ అనే వ్యాపారి తన భార్య కిరణ్ ( Kiran Nayak )కోసం సిలికాన్ విగ్రహం( Silicone statue ) చేయించారు.కరోనా వచ్చి ఆమె మరణించింది.

ప్రశాంత్ కిరణ్‌ని ఎంతగానో ప్రేమించారు.ఆమె లేని లోటు తీరనిదిగా అనిపించింది.

దీంతో ఆయన కిరణ్‌లాగే ఉండే సిలికాన్ విగ్రహం చేయించుకున్నారు.ఇప్పుడు ఆ విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకొని ఆమెను గుర్తు చేసుకుంటున్నాడు.

Telugu Covid, Love, Kiran Nayak, Odisha, Prashantkumar, Silicone Statue, Story,

ప్రశాంత్( Prashant Kumar Nayak ) తన భార్య విగ్రహం కోసం దాదాపు ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు చేశారు.తన పిల్లల కోరిక మేరకు ఆ విగ్రహాన్ని ఇంటి హాల్‌లో పెట్టుకున్నారు.ఆ విగ్రహం అచ్చం నిజమైన మహిళలాగానే కనిపిస్తోంది దాన్ని చూస్తుంటే ఆమె నిజంగా ప్రాణం పోసుకొని వచ్చినట్లుగా అనిపిస్తోంది.అలా ఆమెను ప్రశాంత్ బతికించుకున్నారు.

Telugu Covid, Love, Kiran Nayak, Odisha, Prashantkumar, Silicone Statue, Story,

“2021 ఏప్రిల్ 21న తన భార్యకు జలుబు రావడంతో ఆమెను ఎం.కె.సి.జి.మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్పించారు.కానీ శ్వాస తీసుకోవడం కష్టం కావడంతో, మరో మంచి ఆస్పత్రికి తరలించాలని డాక్టర్లు సలహా ఇచ్చారు.

అందుకే ఆమెను భువనేశ్వర్‌కు తీసుకెళ్లారు.అయితే అక్కడ బెడ్ దొరకలేదు.

దీంతో ఆమెను కటక్ ఆస్పత్రిలో చేర్పించారు.అక్కడ వెంటిలేటర్‌పై ఉంచారు కానీ ఏప్రిల్ 25వ తేదీ సాయంత్రం ఆమె మరణించింది” అని ప్రశాంత్ చెప్పారు.”సిలికాన్ విగ్రహం గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు.అది నా పిల్లల కోరిక.

వారి ఆనందమే నా ఆనందం కాబట్టి, ఆమె సిలికాన్ విగ్రహం చేయించాలని నిర్ణయించుకున్నాం.బెంగళూరులోని ఒక శిల్పిని సంప్రదించి, నాలుగు నుంచి ఐదు సార్లు ఆయన్ని కలుసుకున్నాం.

ఆయన ఆ విగ్రహాన్ని తయారు చేయడానికి ఒకటిన్నర సంవత్సరాలు పట్టింది.అది ఫైబర్, రబ్బరు, సిలికాన్‌తో తయారు చేయబడింది” అని ఆయన చెప్పారు.”నా అమ్మ మరణించిన తర్వాత ఆమెను చాలా మిస్ అవుతున్నాం.దాదాపు ప్రతిరోజు.

ఆమెను మా మధ్య ఎలాగైనా ఉంచాలని ఆలోచిస్తున్నాం.అప్పుడు యూట్యూబ్‌లో సిలికాన్ విగ్రహం గురించి తెలిసి, నాన్నగారికి చెప్పాం.

ఆయన కూడా మనస్ఫూర్తిగా అంగీకరించారు.అలా ఆ విగ్రహాన్ని తయారు చేయించి ఇంటికి తీసుకొచ్చాం.” అని ఆయన చిన్న కూతురు మేహక్ చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube