సాధారణంగా అద్దె ఇంట్లో( Rental House ) ఉన్నవారిని యజమాని ఉన్నపలంగా ఖాళీ చేయడం అన్యాయం.అమెరికా వంటి విదేశాల్లో కంపెనీలు ఇళ్లను అద్దెకు ఇస్తుంటాయి.
ఈ కంపెనీలు కూడా ముందే చెప్పకుండా రెంట్‌కి ఉంటున్న వారిని సడన్ గా గెంటివేయకూడదు.అయితే అమెరికాలోని సౌత్ కరోలినా( South Carolina ) రాష్ట్రంలో ఓ హౌసింగ్ కంపెనీ ఈ రూల్ బ్రేక్ చేసింది.
ఒక విద్యార్థిని అద్దె ఇంటి నుంచి బయటకు పంపించేసింది.ఆ స్టూడెంట్ అద్దె చెల్లించినా, ఆ కంపెనీ వాళ్లు అతనికి ముందే ఎలాంటి నోటిస్ ఇవ్వకుండా అతని ఇంటి నుంచి అన్ని సామానులు తీసివేశారు.
ఈ విషయంలో ఆ విద్యార్థి ఆ హౌసింగ్ కంపెనీపై కోర్టులో కేసు వేశాడు.కోర్టు ఆ విద్యార్థి వైపు నిలబడి, ఆ కంపెనీకి దాదాపు 5.88 కోట్ల రూపాయల జరిమానా విధించింది.

వివరాల్లోకి వెళ్తే, కొలంబియాలోని బెనెడిక్ట్ కళాశాలలో పోస్టెల్( Postell ) అనే ఓ విద్యార్థి చదువుకుంటున్నాడు.అతను ఓ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నాడు.అయితే ఆ ఫ్లాట్ సొంతమైన ఓ కంపెనీ 2022, జులై 11న ఒక ఇమెయిల్ పంపింది.
ఆ ఇమెయిల్‌లో 14 రోజులలోపు ఆ ఫ్లాట్ నుంచి వెళ్లిపోవాలని ఆదేశించింది.ఆయన తల్లికి ఈ విషయం తెలియజేశారు.వెంటనే తల్లి ఆ ఫ్లాట్ యజమానులకు ఫోన్ చేసి, తమ కొడుకు ఆ ఫ్లాట్‌లో కొనసాగడానికి ఇష్టపడుతున్నాడని చెప్పారు.
2022 జులై 18న పోస్టెల్ తల్లి, ఆ ఫ్లాట్‌లో మరో ఆరు నెలలు ఉండడానికి అద్దెగా 3,810 డాలర్లు (దాదాపు 3.20 లక్షల రూపాయలు) చెక్ ద్వారా చెల్లించారు.ఆ చెక్ ఒక వారం తర్వాత క్లియర్ అయింది.
అయితే, 2022 ఆగస్టు 5న పోస్టెల్ కొలంబియాకు తిరిగి వచ్చినప్పుడు, తన ఫ్లాట్ ఖాళీగా ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు.అతని సామాను అంతా ఎవరో తీసేశారు.

పోస్టెల్ తల్లి ఆ ఫ్లాట్ కంపెనీకి ఫోన్ చేసి, తమ కొడుకు సామాను ఎక్కడ ఉందో అడిగారు.ఆ కంపెనీ వాళ్లు తప్పు చేశామని, పోస్టెల్ సామాను పాడైపోయిందని అన్నారు.వారు పరిహారం ఇస్తామని కూడా చెప్పారు.కానీ ఆ తర్వాత వాళ్ళు పోస్టెల్ కుటుంబానికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.దీంతో ఆ కుటుంబం 2022 ఆగస్టు 23న కోర్టులో కేసు వేశారు.
కోర్టులో కేసు వేసినప్పుడు, పోస్టెల్ కుటుంబం ఈ విషయం వల్ల పోస్టెల్ ఎంత మానసికంగా కుంగిపోయాడో చెప్పారు.
పోస్టెల్ స్టడీస్ మిస్ అయ్యాడు.దీని వల్ల అతని మార్కులు తగ్గాయి.
అతనికి ఉన్న స్కాలర్‌షిప్‌లు కూడా ప్రమాదంలో పడ్డాయి.నాలుగు రోజుల విచారణ తర్వాత, జ్యూరీ పోస్టెల్‌కు 230,000 డాలర్లు (దాదాపు రూ.1.90 కోట్లు) నష్టపరిహారం, 462,500 డాలర్లు (దాదాపు రూ.3.80 లక్షలు) శిక్షా పరిహారం ఇవ్వాలని ఆదేశించింది.“ఈ కేసు కోర్టుకు తీసుకెళ్లడం నాకు సంతోషంగా ఉంది.జ్యూరీ మేము ఇచ్చిన ఆధారాల ఆధారంగా తీర్పు ఇచ్చారు” అని పోస్టెల్ చెప్పాడు.
సౌత్ కరోలైనా రాష్ట్ర చట్టం ప్రకారం, ఆ హౌసింగ్ కంపెనీ ఈ మొత్తం పై రెండేళ్ల వడ్డీ కూడా చెల్లించాలి.ఆ వడ్డీ రేటు 8% ఉంటుంది.