పార్టీ ఎన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నా.కఠిన నిర్ణయాలు తీసుకునే విషయంలో వైసిపి అధినేత జగన్( YS Jagan Mohan Reddy ) ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు.
ఇప్పటికే పెద్ద ఎత్తున పార్టీలోని కీలక నేతలు రాజీనామా చేసి ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు.అలా వెళ్లినవారు జగన్ పైన, పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలపైన తీవ్ర వ్యాఖ్యలే చేశారు.
వైసీపీని వీడిని వాళ్ళు చాలామంది కూటమి పార్టీలో తమ రాజకీయ భవిష్యత్తుకు డోకా లేకుండా ముందుగానే హామీలు పొందగా , మరి కొంతమంది ఏ హామీలు లేకుండానే టిడిపి , జనసేన( TDP, Jana Sena ) లో చేరిపోయారు.ఇలా చేరిన వారిలో జగన్ కు అత్యంత సన్నిహితులైన వారు ఉన్నారు.
అయినా వారి విషయంలో పట్టించుకున్నట్టుగానే వ్యవహరించారు.వారిని ఆపేందుకు ప్రయత్నాలు చేయలేదు.

ముఖ్యంగా మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి ,ఆళ్ల నాని, మోపిదేవి వెంకటరమణ , కిలారు రోశయ్య, మాజీ ఎమ్మెల్యే ఉదయభాను వంటి వారు ఉన్నారు.ఎన్నికల ఫలితాలు తర్వాత వీరు పార్టీ మారారు.కాపు సామాజిక వర్గం మద్దతు తమకు దొరకదన్న భయంతో చాలామంది పార్టీ మారినట్లుగా ప్రచారం జరుగుతోంది.ఒంగోలు నియోజక వర్గంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి గెలవాలంటే కాపు సామాజిక వర్గం మద్దతు కచ్చితంగా ఉండాల్సిందే .ఉదయగిరి నియోజకవర్గంలో ఉదయభాను గెలవాలన్నా కాపు తో పాటు , కమ్మ సామాజిక వర్గం సహకరించాల్సిందే.అయితే టిడిపి, జనసేన పొత్తులో ఉండడంతో , ఆ రెండు పార్టీల్లో ఏ పార్టీలో చేరినా, తమ రాజకీయ భవిష్యత్తుకు డొకా ఉండదని , వైసీపీలోనే ఉంటే తమ రాజకీయ భవిష్యత్తుకు గండం ఏర్పడుతుందనే భయంతోనే చాలామంది పార్టీ మారారు.

అయితే వీరిలో చాలామందికి వచ్చే ఎన్నికల్లో టికెట్ దొరకడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.ఎందుకంటే జనసేన, టిడిపిలో ఆయా నియోజకవర్గాల్లో కీలక నేతలు చాలా మంది ఉన్నారు వారిని కాదని టికెట్ ఇచ్చే పరిస్థితి ఉండదని, ముందు నుంచి పార్టీ కోసం కష్టపడిన వారికే ప్రాధాన్యం ఇస్తారనే సంకేతాలతో వీరి రాజకీయ భవిష్యత్తు అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.అయితే వీరు మళ్ళి వైసీపీలో చేరాలనుకున్నా, వారిని చేర్చుకునేందుకు జగన్ సిద్ధంగా లేరట.పార్టీని వీడి వెళ్లినవారు ఎంతటి వారైనా తిరిగి వారిని పార్టీలో చేర్చుకోకూడదని , పాతవారు వెళ్లినా, కొత్త నాయకులను తయారు చేసుకునే సామర్థ్యం తనకు ఉందనే ధైర్యంతో జగన్ ఉన్నారట.
అందుకే ఒకసారి వైసీపీని వీడి వెళ్లిన వారిని తిరిగి పార్టీలో చేర్చుకోకూడదని జగన్ నిర్ణయం తీసుకున్నారట.