చుండ్రు ( dandruff )అనేది మనల్ని చాలా కామన్ గా ఇబ్బంది పెట్టే సమస్యల్లో ఒకటి.ఆడవారే కాదు ఎందరో పురుషులు కూడా చుండ్రుతో సతమతం అవుతూ ఉంటారు.
భుజాలపై చుండ్రు రాలుతుంటే తీవ్రమైన అసౌకర్యానికి గురవుతుంటారు.చుండ్రును వదిలించుకునేందుకు రకరకాల షాంపూలు వాడుతుంటారు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే అస్సలు చింతించకండి.కేవలం రెండు వాషుల్లోనే చుండ్రు మొత్తాన్ని పోగొట్టే ఒక అద్భుతమైన రెమెడీ ఉంది.ఆ రెమెడి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక నిమ్మ పండును( Lemon fruit ) తీసుకొని వాటర్ తో శుభ్రంగా కడిగి స్లైసెస్ గా కట్ చేసుకోవాలి.అలాగే రెండు అంగుళాల అల్లం ముక్కను( ginger ) కూడా తీసుకొని పొట్టు తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో లెమన్ స్లైసెస్ మరియు అల్లం ముక్కలతో పాటు ఒక కప్పు నైట్ అంతా బియ్యం నానబెట్టిన వాటర్ ను పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ ఆముదం( castor oil ) వేసి బాగా మిక్స్ చేస్తే ఒక హెయిర్ టానిక్ రెడీ అవుతుంది.ఈ టానిక్ ను స్కాల్ప్ మొత్తానికి ఒకటికి రెండు సార్లు అప్లై చేసుకుని మసాజ్ చేసుకోవాలి.గంట అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.ఈ హెయిర్ టానిక్ ను రెండు సార్లు వాడారంటే చుండ్రు మొత్తం తొలగిపోతుంది.స్కాల్ప్ హెల్తీ గా మారుతుంది.చుండ్రు మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పెట్టకూడదు అనుకుంటే వారానికి ఒకసారి ఈ టానిక్ ను తయారు చేసుకుని ఉపయోగించండి.
ఈ టానిక్ హెయిర్ ఫాల్ ను అరికడుతుంది.మరియు జుట్టు ఒత్తుగా పెరిగేలా సైతం ప్రోత్సహిస్తుంది.