పవన్ జీ.. ప్రసాదంతో పాటు ఇవి కూడా ఇవ్వండి.. షాయాజీ షిండే షాకింగ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ హీరో సుధీర్ బాబు( Sudheer Babu ) హీరోగా నటించిన తాజా చిత్రం మా నాన్న సూపర్ హీరో.ఇందులో ఆర్నా హీరోయిన్గా నటించింది.

 Sayaji Shinde Request To Pawan Kalyan Give The Plants To Devotees, Sayaji Shinde-TeluguStop.com

షాయాజీ షిండే కీలక పాత్ర పోషిస్తున్నారు.ఇప్పటికే షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ మూవీ దసరా పండుగ కానుకగా అక్టోబరు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రచారంలో భాగంగా సుధీర్‌, షాయాజీ, ఆర్నాలు బిగ్‌బాస్‌ సీజన్‌ 8 షోలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా నటుడు షాయాజీ గురించి సుధీర్‌ బాబు మాట్లాడుతూ.

ఖాళీ ప్రదేశం కనపడితే మొక్కలు నాటతారని వ్యాఖ్యాత నాగార్జునతో అన్నారు.దీంతో ఆశ్చర్యపోయిన నాగార్జున ( Nagarjuna)ఎందుకు ఏంటి అంటూ కారణాన్ని అడిగి తెలుసుకున్నారు.

దీంతో షాయాజీ షిండే దీని వెనుక ఉన్న కారణాన్ని వివరించారు.ఈ మేరకు స్టేజిపై షాయాజీ షిండే మాట్లాడుతూ.

మా అమ్మగారు 97లో కన్ను మూశారు.ఆమె బతికి ఉన్నప్పుడు ఒక విషయం అడిగాను.

అమ్మా నా దగ్గర ఇంత డబ్బు ఉంది.కానీ నేను నిన్ను బతికించుకోలేను.

నేనేం చేయను అని బాధపడి, వెంటనే మరొక విషయం ఆమెకు చెప్పాను.మా అమ్మగారి బరువుకు సమానమైన విత్తనాలను తీసుకుని, ఇండియా మొత్తం నాటుతానని అన్నాను.

నేను నాటిన చెట్లు కొన్నాళ్లకు పెరిగి నీడను ఇస్తాయి.పూలు, పండ్లు ఇస్తాయి.

వాటిని చూసినప్పుడల్లా మా అమ్మ గుర్తుకు వస్తుంది.

Telugu Nagarjuna, Pawan Kalyan, Sayaji Shinde, Sudheer Babu, Tollywood-Movie

మా అమ్మ తర్వాత నాకు భూ మాత కూడా అంతే గుర్తొస్తుంది.సాధారణంగా ఆలయాలకు వెళ్లిన వాళ్లకు ప్రసాదాలు పంచి పెడతారు.ప్రసాదంతో పాటు ఒక మొక్కను కూడా ఇస్తే బాగుంటుంది.

దాన్ని భక్తులు తీసుకెళ్లి నాటితే అందులో భగవంతుడిని చూసుకోవచ్చు.మహారాష్ట్రలో మూడు ఆలయాల్లో నేను ఈ విధానం ప్రారంభించాను.

అయితే అందరికీ అలా మొక్కలు ఇవ్వరు.ఎవరైతే అభిషేకం చేస్తారో వారిలో సుమారు 100, 200 మందికి ప్రసాదం లాగా వీటిని ఇస్తారు.

Telugu Nagarjuna, Pawan Kalyan, Sayaji Shinde, Sudheer Babu, Tollywood-Movie

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌( AP Deputy CM Pawan Kalyan) గారు అపాయింట్‌మెంట్‌ దొరికితే ఆయన్ను కలిసి ఈ వివరాలన్నీ చెబుతాను.దేవుడి ప్రసాదంలాగా మొక్కలను అందరికీ పంచాలి.అవి నాటితే పెరిగి చెట్లు అవుతాయి.తర్వాత ఏడు జన్మలకు అవి పెరుగుతూనే ఉంటాయి అని షాయాజీ షిండే చెప్పడంతో ఆయన ఆలోచనను నాగార్జున మెచ్చుకున్నారు.తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తారు అని నాగార్జున తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube