వైల్డ్ కార్డు ఎంట్రీ.. ముక్కు అవినాష్ రెమ్యూనరేషన్ ఏంతో తెలుసా?

బిగ్ బాస్ సీజన్ 8(Bigg Boss 8) కార్యక్రమం ఇప్పటికే ఐదు వారాలను పూర్తి చేసుకొని ఆరవ వారంలోకి అడుగుపెట్టింది.అయితే 14 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ కార్యక్రమం నుంచి ఇప్పటికే ఆరుగురు కంటెస్టెంట్లు హౌస్ నుంచి బయటకు రాగా 8 మంది వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టారు.

 Mukku Avinash Bigg Boss Wild Card Remuneration Details, Bigg Boss, Wild Card,muk-TeluguStop.com

ఇలా వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన వారందరూ కూడా ఇదివరకు బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్న కంటెస్టెంట్లు కావటం విశేషం.ఇక వైల్డ్ కార్డు(Wild Card) ఎంట్రీ ఇచ్చిన వారిలో కమెడియన్ ముక్కు అవినాష్(Mukku Avinash) ఒకరు.

Telugu Bigg Boss, Mukku Avinash, Mukkuavinash, Wild-Movie

జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా సందడి చేసిన అవినాష్ బిగ్ బాస్ సీజన్ ఫోర్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో సుమారు 10 వారాలపాటు హౌస్ లో కొనసాగిన అవినాష్ అప్పట్లో 15 లక్షల వరకు రెమ్యూనరేషన్(Remuneration) అందుకున్నారంటూ వార్తలు వచ్చాయి.ఇక బిగ్ బాస్ తర్వాత కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న అవినాష్ బుల్లితెర కార్యక్రమాలతో పాటు సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.

Telugu Bigg Boss, Mukku Avinash, Mukkuavinash, Wild-Movie

ఇకపోతే మరోసారి ఈయనకు బిగ్ బాస్ అవకాశాన్ని కల్పించడంతో వెంటనే ఈ కార్యక్రమానికి ఓకే చెప్పారని తెలుస్తుంది.ఇక వైల్డ్ కార్డు ద్వారా ఈయన బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టడం కోసం బిగ్ బాస్ నిర్వహకులు కూడా ఈయనకు భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తున్నట్టు సమాచారం.ప్రస్తుతం ఈయన ఒక వారం పాటు హౌస్ లో కొనసాగడం కోసం ఏకంగా ఐదు లక్షల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది.

ఇలా అవినాష్ వారానికి ఐదు లక్షల రూపాయల రెమ్యూనరేషన్ అందుకోవడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.మరి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈయన ఎన్ని వారాలపాటు హౌస్ లో కొనసాగునున్నారు అనేది తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube