ఫ్రాన్స్‌లో భారత కొత్త రాయబారిగా 1997 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి (ఐఎఫ్ఎస్) , సీనియర్ దౌత్యవేత్త సంజీవ్ కుమార్ సింగ్లా( Senior diplomat Sanjeev Kumar Singla ) నియమితులయ్యారు.ప్రస్తుతం సింగ్లా ఇజ్రాయెల్‌లో భారత రాయబారిగా వ్యవహరిస్తున్నారు.
ఇజ్రాయెల్ – పాలస్తీనా సంక్షోభం, మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో విజయవంతంగా పనులు చక్కబెడుతున్న సంజీవ్ త్వరలోనే ఫ్రాన్స్‌లో కొత్త బాధ్యతలు స్వీకరించున్నారు.
ఇజ్రాయెల్- భారత్‌ల ( Israel- India ) మధ్య దౌత్య సంబంధాల నిర్వహణలో సింగ్లా కీలక పాత్ర పోషించారు.2019 అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌లో భారత రాయబారిగా నియమితులైన సింగ్లా.దాదాపు 18 వేల మంది వృత్తి నిపుణులు, విద్యార్ధులు, 85 వేల మంది భారత సంతతికి చెందిన యూదులతో కూడిన ఇండియన్ డయాస్పోరాతో సన్నిహిత సంబంధాలు నిర్వహించాడు.
ఇజ్రాయెల్‌లో ఆయనకున్న విస్తృత అనుభవం నేపథ్యంలో సింగ్లాను ఇజ్రాయెల్‌పై ఎక్స్‌పర్ట్‌గా విదేశాంగ శాఖ వర్గాలు చెబుతుంటాయి.
ఇజ్రాయెల్‌పై భారత విదేశాంగ విధానాన్ని రూపొందించడంలో సంజీవ్ కుమార్ కీలకపాత్ర పోషించారు.సున్నితమైన విషయాలను, ఇజ్రాయెల్ – పాలస్తీనా సంఘర్షణను అత్యంత చాకచక్యంగా నిర్వహించారు.ఈ కారణంగానే విపత్కర సమయాల్లో ఈ ప్రాంతంలోని దేశాలతో భారత్ బంధాలను కొనసాగించగలిగింది.
ఇజ్రాయెల్‌లో రాయబారి కావడానికి ముందు ప్రధాని నరేంద్ర మోడీ 2014లో అధికారాన్ని అందుకున్నప్పుడు ఆయనకు ప్రైవేట్ సెక్రటరీగా పనిచేశారు.మోడీ ఉన్నత స్థాయి నిర్ణయాలు తీసుకోవడంలో సింగ్లా కీలకపాత్ర పోషించారు.
పశ్చిమాసియా సహా కీలకమైన విదేశాంగ విధాన నిర్ణయాలో సంజీవ్ పాలు పంచుకున్నారు.
గతంలో ఫ్రాన్స్, బంగ్లాదేశ్, స్విట్జర్లాండ్ తదితర భారతీయ మిషన్‌లలో వివిధ హోదాలలో పనిచేశారు సింగ్లా.పారిస్‌లో చేసిన అనుభవం ఉండటంతో తాజాగా ఆయనను ఫ్రాన్స్‌లో భారత రాయబారిగా విదేశాంగ శాఖ నియమించింది.అలాగే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని యూఎస్ డెస్క్‌లో, విదేశాంగ కార్యదర్శి కార్యాలయంలో డైరెక్టర్‌గా, ఇతర ముఖ్యమైన పదవులను సంజీవ్ కుమార్ సింగ్లా నిర్వర్తించారు.