దసరా పండుగకు ఊరికెళ్ళే వారు అప్రమత్తంగా ఉండాలి: ఏఎస్ఐ మల్లేశ్

యాదాద్రి భువనగిరి జిల్లా: దసరా పండుగకు ఊరుకు వెళ్లే మండల ప్రజలు పోలీసుల సూచనలు పాటించకపోతే దొంగల బారినపడే అవకాశం ఉందని మోటకొండూరు ఏఎస్ఐ మల్లేశ్ అన్నారు.రాచకొండ పోలీసు వారి ఆదేశాలతో స్థానిక ఎస్సై పాండు సూచనల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా మోట కొండూరు మండల పరిధిలోని ముత్తిరెడ్డిగూడెం ప్రధాన రహదారిపై గ్రామ ప్రజలకు బాటసారులకు,ప్రయాణికులకు దసరా పండుగకు ఊరు వెళ్లే ప్రజలకు దొంగతనాల నివారణ గురించి పెట్రోల్ మొబైల్ మైకు ద్వారా ప్రచారం చేస్తూ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

 Dussehra Festival Goers Should Be Alert Asi Mallesh, Dussehra Festival , Alert,-TeluguStop.com

ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ

ఊరికి వెళ్ళే సమయంలో వీలైనంత మేరకు ఇంటిలో విలువైన వస్తువులు, నగదు మరియు బంగారం ఆభరణాలు పెట్టకండి వాటిని బ్యాంకు లాకర్లో లేదా భద్రంగా ఉన్న చోట దాచుకోవడం ఉత్తమం, బీరువా తాళం చెవులు బీరువా పైన కానీ,బట్టల క్రిందకానీ,ఇంట్లో కానీ,పెట్టి వెళ్లవద్దు.అలాగే విలువైన వాహనాల తాళం చెవులు కూడా వెంట తీసుకుని వెళ్తే మంచిది.

ఇంటి ముందు తలుపులకు సెంటర్ లాక్ వేసి బయట గొల్లం పెట్టకండి,ఇళ్లకు నాసిరకం తాళాలు వాడొద్దని,తాళం కనపడకుండా కర్టైన్స్ వేయాలి,ఇంటి తలుపుల ముందు చెప్పులు ఉంచండి,బయట గేటుకు లోపల నుంచి తాళం వేయండి,

ఇంట్లో ముందు గదిలో లైట్ వేసి ఉంచండి, పేపర్ బాయ్ మరియు పాలు వేసే వాళ్లకు రావద్దని చెప్పండి,మీరు ఊరికి వెళ్ళేటప్పుడు మీకు నమ్మకమైన వారికి అలాగే స్థానిక పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వలని ఇంకా పలు సూచనలు చేశారు.ఎవరిమీదైనా అనుమానం వస్తే 100 టోల్ ఫ్రీ నెంబర్ కు గాని,రాచకొండ పోలీస్ కంట్రోల్ రూమ్ 87126 62666 కు లేదా వాట్సప్ నంబర్ 87126 62111 కి సమాచారం ఇవ్వాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్స్ పరుషురాములు,వెంకటేష్,హోమ్ గార్డ్ సురేష్,గ్రామ ప్రజలు సొప్పరి మచ్చగిరి, ఎర్కలి యాదగిరి,మధు, జంగయ్య,దర్శన్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube