తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ: ఎంపిడివో ఇందిరా

యాదాద్రి భువనగిరి జిల్లా:తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగని ( Bathukamma festival), మోటకొండూరు ఎంపిడివో ఇందిరా(MPDO Indira) అన్నారు.సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri District) మోటకొండూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు.

 Bathukamma Festival Symbolizes Telangana Cultural Traditions-mpdo Indira, Bathuk-TeluguStop.com

ఈ సందర్భంగా ఎంపీడీవో ఇందిర మాట్లాడుతూ అన్ని దేవతలను పూలతో కొలుస్తుండగా,తీరొక్క పూలతో బతుకమ్మలను కొలచే అత్యంత విశిష్టమైన పండుగని అన్నారు.ప్రతి సంవత్సరం ఆడబిడ్డలు అంతా ఒక్క దగ్గర ఉత్సాహంగా జరుపుకునే బతుకమ్మ పండుగను రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటారన్నారు.

ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ యశోద,ఎపిఓ అరుణ కుమారి,టిఎలు స్వామి, చంద్రమోహన్,మంగ,సిఓ లు అలువేలుమంగ,సిద్ది మల్లేశ్,పంచాయతీ కార్యదర్శులు,ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube